Samantha: సమంత త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీల ట్వీట్ల వర్షం!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తన అనారోగ్య సమస్యను తాజాగా వెల్లడించడంతో ఆమె అభిమానులు తీవ్ర కలత చెందుతున్నారు సామ్ ఆరోగ్యం గురించి తెలుసుకుని జూనియర్ ఎన్టీఆర్, నాని, బండ్ల గణేష్, థమన్, దుల్కర్ సాల్మాన్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వంటి వారు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Samantha: సమంత త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీల ట్వీట్ల వర్షం!

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తన అనారోగ్య సమస్యను తాజాగా వెల్లడించడంతో ఆమె అభిమానులు తీవ్ర కలత చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని వారు కోరుతున్నారు. అయితే ఇండస్ట్రీలో సమంతకు ఎంత మంచి పేరుందో అంతే మంచి మనస్తత్వం గల వ్యక్తిగా ఆమెకు అభిమానులు కూడా ఉన్నారు. పలువురు సెలెబ్రిటీలు కూడా సమంత హార్డ్ వర్క్, కమిట్‌మెంట్ చూసి ఆమెకు అభిమానులుగా మారారు.

Samantha: సమంత అసలు ఏ వ్యాధితో బాధపడుతోంది.. అది ప్రాణాంతకమా?

అయితే ఇప్పుడు వారందరూ కూడా సామ్ వీలైనంత త్వరగా కోలుకోవాలని.. తిరిగి అంతే స్ట్రాంగ్‌గా సామ్ వస్తుందని వారు కోరుతున్నారు. ఇక సామ్ ఆరోగ్యం గురించి తెలుసుకుని జూనియర్ ఎన్టీఆర్, నాని, బండ్ల గణేష్, థమన్, దుల్కర్ సాల్మాన్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వంటి వారు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Samantha: సమంతకు ఆ సీరియస్ జబ్బు.. త్వరలోనే కోలుకుంటానని ప్రకటన

సమంత ఎంతో ధృడమైన వ్యక్తని.. ఆమె త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుందని వారు పేర్కొన్నారు. ఏదేమైనా సమంత అనారోగ్యం గురించి తెలుసుకుని అటు అభిమానులు, ఇటు సెలెబ్రిటీలు వరుస ట్వీట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.