Samantha: సమంత అసలు ఏ వ్యాధితో బాధపడుతోంది.. అది ప్రాణాంతకమా?

స్టార్ బ్యూటీ సమంత గతకొంత కాలంగా అనారోగ్యం బారిన పడినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతూ వచ్చాయి. అయితే ఎట్టకేలకు వాటిని నిజం చేస్తూ సమంత స్వయంగా తాను ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా ప్రకటించింది.

Samantha: సమంత అసలు ఏ వ్యాధితో బాధపడుతోంది.. అది ప్రాణాంతకమా?

Samantha Suffering From Myositis Is Danger Or Not

Samantha: స్టార్ బ్యూటీ సమంత గతకొంత కాలంగా అనారోగ్యం బారిన పడినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతూ వచ్చాయి. అయితే ఎట్టకేలకు వాటిని నిజం చేస్తూ సమంత స్వయంగా తాను ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులతో పాటు చాలా మంది సెలెబ్రిటీలు సైతం అవాక్కయ్యారు. అసలు సమంతకు సోకిన వ్యాధి ఏమిటా అని వారు ఆరా తీస్తున్నారు. ఇక సామ్ డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ఈ వ్యాధి వల్ల ప్రాణాలకేమన్నా ముప్పు ఉందా అనే కోణంలోనూ ఈ వ్యాధి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.

Samantha: సమంతకు ఆ సీరియస్ జబ్బు.. త్వరలోనే కోలుకుంటానని ప్రకటన

వాస్తవానికి.. సమంత బాధపడుతున్న ‘మయోసైటిస్’ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఇమ్యునిటీ కండీషన్ పడిపోవడం ఈ వ్యాధి లక్షణం. దీంతో శరీరంలో తీవ్ర అలసట, నరాల బలహీనత మరియు నొప్పి తీవ్రంగా ఏర్పడుతాయి. మయోసైటిస్‌ను వెంటనే గుర్తించకపోతే ఎక్కువసేపు నిల్చోవడం, భోజనం చేసేటప్పుడు సరిగా మింగలేకపోవడం లాంటి లక్షణాలు కూడా ఏర్పడతాయి. నరాలకు సంబంధించిన మేజర్ సమస్య కావడంతో ఈ వ్యాధి సోకిన వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు సూచిస్తుంటారు.

Samantha : సమంతతో నేను అప్పుడే ప్రేమలో పడిపోయాను.. ఇప్పటికి కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్..

ఇక ఈ వ్యాధికి చికిత్సను ముందుగా స్టిరాయిడ్స్‌తోనే ప్రారంభిస్తారు. ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్ల రూపంలో శరీరంలోకి స్టిరాయిడ్స్‌ను పంపి, ముందుగా నరాల నొప్పులను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తారు. రోజూవారి వ్యాయామం, ఫిజియోథెరఫీ వంటివి ఈ వ్యాధిని తగ్గించడంలో చాలా చక్కగా పనిచేస్తాయని డాక్టర్లు చెబుతారు. అందుకే సమంత గతకొద్ది రోజులుగా కేవలం విశ్రాంతికే పెద్దపీట వేసిందని ఆమె చెప్పుకొచ్చింది. ఏదేమైనా సామ్, త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.