Puri Jagannadh: నేను ఎవడినైనా మోసం చేసానంటే.. అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకుడినే.. పూరి ప్రెస్ నోట్ రిలీజ్!

లైగర్ సినిమా ప్లాప్ అవ్వడంతో.. డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. దీంతో నిర్మాత మరియు దర్శకుడు పూరి, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య వివాదం రాచుకుంది. ఇటీవల జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వారిపై పూరీజగన్ కేసు ఫైల్ చేయగా.. నేడు ప్రెస్ నోట్ విడుదల చేశాడు. నేను ఎవడినైనా మోసం చేసానంటే, అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకుడిని మాత్రమే అని కుండ బద్దలు కొట్టేసాడు.

Puri Jagannadh: నేను ఎవడినైనా మోసం చేసానంటే.. అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకుడినే.. పూరి ప్రెస్ నోట్ రిలీజ్!

Puri Jagannadh Press Note on Distributors issue

Updated On : October 30, 2022 / 12:15 PM IST

Puri Jagannadh: లైగర్ సినిమా ప్లాప్ అవ్వడంతో.. డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. దీంతో నిర్మాత మరియు దర్శకుడు పూరి, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య వివాదం రాచుకుంది. ఇటీవల జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వారిపై పూరీజగన్ కేసు ఫైల్ చేయగా.. నేడు ప్రెస్ నోట్ విడుదల చేశాడు. నేను ఎవడినైనా మోసం చేసానంటే, అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకుడిని మాత్రమే అని కుండ బద్దలు కొట్టేసాడు.

Puri Jagannadh : పూరి ఇంటి వద్ద భద్రత.. కోర్టుకి వెళ్తామంటున్న డిస్ట్రిబ్యూటర్లు..

ప్రెస్ నోట్.. గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి? ఊపిరి ఒదిలెయ్యటమే. గెలుపోటములు కూడా అంతే, ఒకటి వస్తే ఇంకోటి పోక తప్పదు. పడతాం-లేస్తాం, ఏడుస్తాం-నవ్వుతాం, ఎన్నో రోజులు ఏడ్చిన తరువాత జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు.

నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, వడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, ఊరు వేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సన్నివేశాలు మాత్రమే. అందుకే లైఫ్ ని సినిమాలా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు.

లైఫ్ లో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. ఒకవేళ అవి జరగకపోతే మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరోలా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది.

ఇక డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే. మధ్యలో జరిగేది అంతా డ్రామా. మీ పూరి జగన్నాధ్.