Puri Jagannadh : లైగర్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ పై పూరి జగన్నాధ్ పోలీస్ కేసు.. మరింత ముదురుతున్న వివాదం..

బుధవారం సాయంత్రం పూరి జగన్నాధ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసి వారి నుంచి.............

Puri Jagannadh : లైగర్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ పై పూరి జగన్నాధ్ పోలీస్ కేసు.. మరింత ముదురుతున్న వివాదం..

Puri Jagannadh complaint to polices on Liger distributors

Puri Jagannadh :  ఇటీవల విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమాని తెరకెక్కించారు. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా రిలీజయిన లైగర్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాని పూరి జగన్నాధ్, కరణ్ జోహార్ కలిసి నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎక్కువ ధర పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి భారీగా నష్టం చేకూరింది.

దీంతో లైగర్ సినిమాని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంతా తమ నష్టాన్ని భర్తీ చేయాలని పూరి జగన్నాధ్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే పూరి డబ్బులు ఇస్తాను కానీ టైం పడుతుంది అని చెప్పినా వినకుండా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పూరి ఇంటి వద్ద ధర్నాకి దిగుతామని, డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోము అని పూరీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీంతో ఈ వివాదం టాలీవుడ్ లో చర్చగా మారింది. పూరి కూడా దీనిపై స్పందిస్తూ ఇస్తాను కానీ టైం పడుతుంది, ధర్నాలు అంటూ ఏమైనా చేసి నా పరువు మాత్రం తీస్తే నేను ఊరుకోను అని మాట్లాడిన కాల్ వైరల్ గా మారింది. అయినా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తగ్గకపోవడంతో తాజాగా పూరి జగన్నాధ్ వారిపై పోలీసు కేసు నమోదు చేశాడు.

Puri Jagannadh : పూరి జగన్నాధ్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న బయ్యర్స్

బుధవారం సాయంత్రం పూరి జగన్నాధ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసి వారి నుంచి తనకి, తన కుటుంబానికి హాని ఉందని, మాపై హింసకు పాల్పడేలా వీళ్ళు ఇతరులని ప్రోత్సహిస్తున్నారని, తమకు రక్షణ కావాలని ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ మాట్లాడకపోవడం గమనార్హం.