చిన్నారి వర్షిత హత్యాచారం కేసు : ఉరి తియ్యాలని టవర్ ఎక్కారు

సంచలనం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో న్యాయం కోసం తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నారి వర్షితను పొట్టనపెట్టుకున్న నిందితుడు రఫీని ఉరి తియ్యాలని డిమాండ్

  • Publish Date - November 18, 2019 / 09:39 AM IST

సంచలనం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో న్యాయం కోసం తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నారి వర్షితను పొట్టనపెట్టుకున్న నిందితుడు రఫీని ఉరి తియ్యాలని డిమాండ్

సంచలనం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో న్యాయం కోసం తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నారి వర్షితను పొట్టనపెట్టుకున్న నిందితుడు రఫీని ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో మహిళా సంఘాలతో కలిసి వర్షిత తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. నరరూప రాక్షసుడు రఫీని వెంటనే ఉరి తియ్యాలని కొందరు యువకులు విద్యుత్ లైన్ టవర్ ఎక్కారు. న్యాయం జరిగే వరకు టవర్ దిగేది లేదని చెప్పారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు వారికి నచ్చ చెబుతున్నారు. కిందకి దిగిరావాలని కోరారు. టవర్ ఎక్కిన వారిని కిందకి దింపే ప్రయత్నంలో ఉన్నారు.

చిన్నారి వర్షిత(5) హత్యాచారం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వర్షిత హత్యకు కారణమైన రఫీని ఉరి తీయాలని కుటుంబ సభ్యులు సోమవారం(నవంబర్ 18,2019) నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనకు విద్యార్థులు మద్దతు తెలిపి ర్యాలీ నిర్వహించారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. కాగా, పోలీసుల తీరుకి నిరసనగా కొందరు యువకులు హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్ ఎక్కడం ఉద్రిక్తకు దారి తీసింది.

నవంబర్ 7న తమ 3వ కూతురు వర్షితను తీసుకొని తల్లిదండ్రులు ఓ వివాహ రిసెప్షన్‌కు వెళ్లారు. అక్కడ దారుణం జరిగింది. నిందితుడు రఫీ మండపం నుంచి వర్షితను తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు.. అనేక కోణాల్లో దర్యాఫ్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. పఠాన్‌ మహ్మద్‌ రఫీ (25)ని శనివారం(నవంబర్ 16,2019) అరెస్ట్ చేశారు.