లక్నోలో కలకలం రేగింది. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్‌ను గుర్తు తెలియని దుండుగలు కాల్చి చంపారు. ఈ ఘటన లక్నోలోని హజరత్ గంజ్‌లో చోటు చేసుకుంది. 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ఎప్పటిలాగానే మార్నింగ్ వాక్‌కని బయలుదేరారు. ఈయనతో పాటు సోదరుడు కూడా ఉన్నారు. కొద్దిసేపటి అనంతరం గుర్తు తెలియని దుండగులు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ భవంతి వద్ద జరిగింది. తలలో బుల్లెట్ దూసుకపోవడంతో రంజిత్ బచ్చన్ అక్కడినే కుప్పకూలిపోయాడు. ఆయన సోదరుడికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కానీ బచ్చన్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో బచ్చన్ సోదరుడు చికిత్స పొందుతున్నాడు. ఘటనాస్థలానికి ఫోరెన్సిక్ నిపుణులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు రంగంలోకి దిగారు. ఆరు క్రైం బ్రాంచ్ బృందాలు గాలింపులు చేపట్టాయి. నిందితులను త్వరలోనే పట్టుకుని శిక్షిస్తామని పోలీసులు అంటున్నారు.
* గత అక్టోబర్‌లో హిందూ సమాజ్ పార్టీ నాయకుడు కమలేశ్ తివారీని దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
* 2015లో మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారాయన.
* చర్యలు తీసుకోవాలని ముస్లిం సంఘాలు అప్పట్లో డిమాండ్ చేశాయి.
* 2019లో జరిగిన ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తివారీ..పరాజయం పొందారు.
Read More : యాంకర్ ప్రదీప్‌పై కంప్లయింట్