ISIS కొత్త అధ్యక్షుడు మాకు తెలుసు: ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ సంచలన ప్రకటన చేశాడు. ఐసిస్ అధ్యక్షుడు అబూ బకర్ అల్ బాగ్దాదీని మట్టుబెట్టిన కొద్ది రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిపైనా ఫోకస్ పెట్టినట్లు తెలిపాడు. ‘ఐసిస్‌కు కొత్త లీడర్ ఉన్నాడు. మాకు కచ్చితంగా ఆయనెవరో తెలుసు’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశాడు. 

దీనిపై యూఎస్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. బాగ్దాదీని హత్య చేసిన రోజు ఉదయం కూడా ట్రంప్ ఇలాంటి ట్వీట్ ఒకటి చేశారు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన విషయం జరిగిందని. బాగ్దాదీ తర్వాత అతని స్థానంలో అబూ ఇబ్రహీం అల్ హషీమీ అల్ ఖురైషీ వస్తాడని ఎప్పడినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. 

దీనికి కారణం కూడా లేకపోలేదు. 2014 నుంచి ఇప్పటికీ పలుమార్లు బాగ్దాదీ చనిపోయినట్లుగా అమెరికా తప్పుడు ప్రకటనలు చేయడంతో కొత్త అధ్యక్షుడి పేరు అప్పటినుంచే వార్తల్లో నిలిచింది. ఇటీవల ఐసీస్ గ్రూపు కూడా తమ అధ్యక్షుడు చనిపోయాడని కన్ఫార్మ్ చేసి కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోనున్నట్లు తెలిపింది.