బీజేపీ నేత కుమార్తె కిడ్నాప్‌!

  • Publish Date - February 15, 2019 / 10:01 AM IST

పశ్చిమ బెంగాల్‌ బిర్భూం జిల్లాలో BJP నాయకుడి కూతురు(22) శుక్రవారం (ఫిబ్రవరి 15, 2019) కిడ్నాప్‌ అవడం మిస్టరీగా మారింది. సడన్ గా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఇంట్లోకి చొరబడిన ఆమెను అపహరించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.  

సుప్రభాత్‌ బత్యబయాల్‌, గురువారం రాత్రి ఓ సమావేశం నిమిత్తం బయటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన కూతురితో పాటు సుప్రభాత్‌ సోదరుడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇంట్లోకి వచ్చిన ఐదుగురు ఆగంతకులు సుప్రభాత్‌ కూతురిని కిడ్నాప్‌ చేశారు. ఈ విషయం గురించి సుప్రభాత్‌ సోదరుడు మాట్లాడుతూ… ‘ ఐదుగురు వ్యక్తులు వచ్చారు. మొదట మమ్మల్ని ఇంట్లో బంధించి తాళం వేశారు. ఆ తర్వాత కాసేపటికి ఇంట్లో చొరబడి తుపాకీతో బెదిరించి నా సోదరుడి కూతురిని తిసుక్కెళ్లారు. కార్లో ఎక్కించుకుని పరారయ్యారు’ అని పేర్కొన్నారు.  

ఈ విషయంలో రాజకీయ నాయకులకు ప్రమేయం లేదని భావిస్తున్నట్లు బీర్‌భూమ్‌ జిల్లా SP శ్యామ్‌ సింగ్‌ తెలిపారు. త్వరలోనే బాధితురాలి ఆచూకీ కనుగొంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి కుదుటపడింది.