West Bengal Fire: పశ్చిమ బెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 12 మంది గాయపడగా, 50 వరకు ఇళ్లు దగ్ధమయ్యాయి. పశ్చిమ బెంగాల్, సిలిగురిలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానిక రాణా బస్తీలోని వార్డ్ నెంబర్ 18లో అగ్ని ప్రమాదం సంభవించింది.
Pheasant Pigeon: 140 సంవత్సరాల తర్వాత కనిపించిన అరుదైన పక్షి.. వీడియో ఇదిగో
ఇది క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 50 వరకు ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఎనిమిది ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పేశాయి. ఈ క్రమంలో ఒక ఫైర్‌మెన్ కూడా గాయపడ్డాడు. అతడితోపాటు మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరికి చికిత్స కొనసాగుతోంది. మిగిలిన క్షతగాత్రుల్ని కూడా ఆస్పత్రికి తరలించారు. మిగతా వాళ్లు ప్రస్తుతం స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు అధికారులు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేసి, అక్కడికి తరలించారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో మొత్తం రెండు వేల మంది వరకు ప్రజలు నివసిస్తూ ఉంటారని అంచనా. ఒక ఇంట్లో సిలిండర్ పేలడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.