west bengal : చైనాకు తరలిస్తున్న రూ.30 కోట్లు రెండున్నర కేజీల పాము విషం .. విలువ రూ.30 కోట్లు

ఫ్రాన్స్ నుంచి వయా భారత్ మీదుగా చైనాకు అక్రమంగా పాము విషాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అటవీశాఖ అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. అతనినుంచి ఏకంగా రెండున్నర కేజీల పావు విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఈ విషం విలువ రూ.30 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

smuggled two and half kgs snake venom worth rs.30 cr seized in darjeeling district

west bengal : ఫ్రాన్స్ నుంచి వయా భారత్ మీదుగా చైనాకు అక్రమంగా పాము విషాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అటవీశాఖ అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. అతనినుంచి ఏకంగా రెండున్నర కేజీల పావు విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఈ విషం విలువ రూ.30 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఫన్సిడేవా ప్రాంతంలో సోదాలు జరిపిన అటవీ అధికారులు శనివారం (అక్టోబర్ 15,2022) రాత్రి రెండున్నర కేజీల విషాన్ని గుర్తించారు. ఈ విషాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని ఖురాయి ప్రాంతంలో నివసిస్తున్న మహమ్మద్ సరాఫత్ గా గుర్తించారు.

నిందితుడిని పోలీసులు విచారించగా పాము విషం ఫ్రాన్స్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా భారత్లోకి వచ్చిందని..ఈ విషయాన్ని నేపాల్ కు తీసుకు వెళ్తున్నానని..నేపాల్ నుంచి చైనాకు తరలించాలనే ప్లాన్ తో ఉన్నామని తెలిపాడు. విషాయన్ని ఓ గాజు సీసాలో నింపి తరలిస్తున్నాడు సదరు నిందితడు. ఆ బాటిల్ కు ఫ్రాన్స్ చెందిన ట్యాగ్ ఉందని అధికారులు గుర్తించారు. అక్రమ రవాణా తరలింపులపై నిఘా పెట్టామని అంతర్జాతీయ స్మగ్లింగ్ యూనిట్ పాత్రపై విచారణ జరుపుతున్నామని రేంజర్ సోనమ్ భూటియా వెల్లడించారు.

కాగా..పశ్చిమ బెంగాల్‌లో పాము విషాన్ని స్వాధీనం చేసుకోవడం 35 రోజుల్లో ఇది రెండోసారి. సెప్టెంబరు 10న జల్పాయ్‌గురి జిల్లాలో రూ. 13 కోట్ల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2021 మార్చిలో ఒడిశాలో ప్రమాదకర పాముల్లోని విషాన్నిసేకరించి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు. దాదాపు 200కు పైగా కోబ్రాల నుండి సేకరించిన లీటర్ విషాన్ని ఓ ముఠా గుట్టుగా తరలిస్తుండగా ఓ వ్యక్తిని భువనేశ్వర్ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఈ విషం విలువ దాదాపు కోటి రూపాయల వరకు వుంటుందని తెలిపారు. పాముల విషాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఈ ముఠాలో ఓ మహిళ కూడా వుంది.