కుటుంబాన్ని వదిలేసి మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించింది. తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు భవానీ ఆందోళనకు దిగింది.
కుటుంబాన్ని వదిలేసి మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించింది. ఖమ్మం జిల్లాకు చెందిన భవానీ అనే మహిళ, సతీశ్ భార్యభార్తలు. ఈ క్రమంలో విడాకులు ఇవ్వాలని సతీశ్.. భవానీని తరుచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. సతీష్ కుటుంబాన్ని వదిలేశారు. అతను వేరే యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా పగిరి టీచర్స్ కాలనీలో యువతితో ఉన్న భర్త సతీశ్‌ను భార్య భవానీ పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులకు పట్టించింది. 100 కు డయల్ చేసి వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని, తన భర్తను పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నాడని… ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరిస్తున్నట్లు పోలీసులకు వివరించింది. అలాగే… కంప్లైట్ చేసిన తనకు సెక్యూరిటీ ఇవ్వట్లేదని, లేడీ కానిస్టేబుల్స్ లేకుండా తోసేస్తున్నారంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహిళకు రక్షణకు కల్పించాల్సిన పోలీసులు ఆమెతో దురుసుగా ప్రవర్తించినట్లు సమచారం. మహిళా పోలీసులు లేకపోవడంతో సదరు మహిళ పట్ల పోలీస్ హెడ్ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. సదరు మహిళ, యువతిని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. భర్త సతీశ్‌ను వదిలేసే ప్రయత్నం చేస్తున్నారంటూ భవానీ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది.
తనకు న్యాయం చేయాలని స్టేషన్ ముందు భవానీ ఆందోళనకు దిగింది. తనకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త సతీష్ తనకు కావాలని భార్య భవానీ కోరుకుంటున్నారు. అయితే ఇది ఖమ్మం జిల్లా పరిధిలోకి వస్తుందని.. తమ పరిధిలోకి రాదని నిన్న కౌన్సిల్ ఇచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలకు పంపించారు.
Click Here>>చికెన్, మటన్ అమ్మకాలపై నిషేధం.. ఎవరూ తినొద్దని ఆదేశం