Wife, Daughter-In-Law Kill Man Over Illicit Realation : ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. చిన్న కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామను అత్త , పెద్ద కొడలు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తర ప్రదేశ్ లోని భడోహి జిల్లాలోని కోయిరానా పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామంలో నివసించే 55 ఏళ్ళ వ్యక్తికి నలుగురు కుమారులు ఉన్నారు. వారిలో ఇద్దరికి పెళ్లైంది. ఉపాధి కోసం వారంతా ముంబై వలస వెళ్లారు. కోడళ్లిద్దరూ అత్త,మామలతో కలిసి గ్రామంలో నివసించసాగారు.
ఈ క్రమంలో మామ, చిన్నకోడలితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అత్త, పెద్దకోడలికి ఈ వ్యవహారం నచ్చలేదు. దీంతో వారు చిన్న కోడలిని కొన్నాళ్లు పుట్టింట్లో ఉండి రమ్మని చెప్పి పంపించి వేశారు. చిన్న కోడలిని పుట్టింటికి పంపించడంతో ఆగ్రహించిన మామ తన భార్య, పెద్ద కోడలిపై దాడి చేశాడు. ఈ దాడిలో పెద్దకోడలి కంటికి గాయం అయ్యింది.
నాలుగు రోజుల క్రితం మామ చిన్న కోడలిని పుట్టింటి నుంచి పిలిపించి అదే గ్రామంలో తన ఇంటికి కొద్ది దూరంలో వేరొక ఇల్లు తీసుకుని అక్కడ కాపురం పెట్టాడు. ఎంత చెప్పిన భర్త తన పద్ధతి మార్చుకోకపోవటంతో, చేసేదేమి లేక అత్త, పెద్ద కోడలు కలిసి శనివారం రాత్రి మామ, చిన్నకోడలు నివసిస్తున్న ఇంటికి వెళ్లి మామపై కత్తితో గొంతుకోసి హత్య చేశారు.
మామపై అత్త, తోడి కోడలు దాడి చేయటంతో భయపడిన చిన్న కోడలు పరుగున వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్ధలానికి చేరుకున్నపోలీసులు తీవ్ర గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు…. ముంబైలో ఉన్న మృతుడి కుమారులకు సమాచారం ఇచ్చారు. కేసు విచారణ జరుపుతున్నట్లు భడోహి పోలీసు సూపరింటెండెంట్ రామ్ బదన్ సింగ్ తెలిపారు.