భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వేధింపులు తాళలేక ఓ భార్య కట్టుకున్న భర్తను కడతేర్చింది. రోకలి బండతో కొట్టి చంపేసింది.

  • Publish Date - August 30, 2019 / 10:41 AM IST

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వేధింపులు తాళలేక ఓ భార్య కట్టుకున్న భర్తను కడతేర్చింది. రోకలి బండతో కొట్టి చంపేసింది.

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వేధింపులు తాళలేక ఓ భార్య కట్టుకున్న భర్తను కడతేర్చింది. రోకలి బండతో కొట్టి చంపేసింది. హత్య చేసిన అనంతరం ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. వేధింపులు తట్టుకోలేకనే హత్య చేసినట్లు అంగీకరించింది. 

గోస్పాడు మండలం యాళ్ళూరు గ్రామంలో నివాసముంటున్న రేష్మ, షేక్ మహబూబ్ భార్యాభర్తలు. 11 సంవత్సరాల క్రితం వీరిద్దరికి వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు 7 సంవత్సరాలు, మరొకరు 3 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నారు. ఈక్రమంలో భర్త షేక్ మహబూబ్ అనేక సంవత్సరాలుగా భార్య రేష్మను వేధింపులకు గురిచేస్తున్నాడు. ప్రతి రోజూ మద్యం తాగి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. 

భర్త వేధింపులు భరించలేక శుక్రవారం (ఆగస్టు30, 2019) ఉదయం భార్య రోకలి బండతో కొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అతను మృతి చెందాడు. హత్య అనంతరం రేష్మ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. తానే హత్య చేసినట్లు భార్య రేష్మ స్వయంగా పోలీసులకు వెల్లడించారు.

పోలీసు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. భర్త చనిపోవడం, భార్య స్టేషన్ లో లొంగిపోవడంతో పిల్లలు అనాధలుగా మారారని బాధపడతున్నారు. తాగుడుకు బానిసలు కాకూడదని అంటున్నారు.

Also Read : రాజధాని మారిస్తే మోడీని కలుస్తా : పవన్ వార్నింగ్