ప్రియుడితో కలిసి దారుణం : భర్తను చంపి అంత్యక్రియలు కూడా చేసిన భార్య

హైదరాబాద్: బోయిన్‌ల్లిలో దారుణం జరిగింది. ఓ భార్య ఘోరానికి తెగబడింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అంతేకాదు మూడో కంటికి తెలియకుండా అంత్యక్రియలు కూడా

  • Publish Date - February 7, 2019 / 08:24 AM IST

హైదరాబాద్: బోయిన్‌ల్లిలో దారుణం జరిగింది. ఓ భార్య ఘోరానికి తెగబడింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అంతేకాదు మూడో కంటికి తెలియకుండా అంత్యక్రియలు కూడా

హైదరాబాద్: బోయిన్‌ల్లిలో దారుణం జరిగింది. ఓ భార్య ఘోరానికి తెగబడింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అంతేకాదు మూడో కంటికి తెలియకుండా అంత్యక్రియలు కూడా చేసేసింది. ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని బాబాఖాన్ గా గుర్తించారు. అతడి భార్య పేరు జహీదా. ప్రియుడి మోజులో పడిన జహీదా భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే స్కెచ్ వేసి భర్తను చంపింది. ప్రియుడు, అతని స్నేహితుల సాయంతో 2019, ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం అర్ధరాత్రి ఒంటి గంటకు గొంతునులిమి హతమార్చారు. అనంతరం అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఈ విషయాలను ఏసీపీ రామిరెడ్డి తెలిపారు. భార్య జహీదా, ప్రియుడు, అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.