Tamilnadu: ‘దొంగ’ భర్త కోసం కోర్టులోనే విషం తాగిన 17 ఏళ్ల యువతి

మిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లా సెందరై సమీపంలోని ఇడయకురిచ్చి గ్రామానికి చెందిన పురల్చీతమిళ్ (27) అనే వ్యక్తిని ఇటీవల చైనా స్నాచింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై అరియలూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 11 దొంగతనం కేసులు నోమోదై ఉన్నాయి. ఇన్ని కేసులు ఉండడంతో జిల్లా కలెక్టర్ రమణ సరత్వాతి నిందితుడిపై గ్యాంగ్‭స్టర్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించారు.

Tamilnadu: ప్రేమ గుడ్డిదో, ఎడ్డిదో.. కానీ తాము ప్రేమించిన వారి కోసం ఏమైనా చేయిస్తుంది. చేస్తుంది తప్పైనా తెగింపునిస్తుంది. తమకు కావాల్సిన వారిని దక్కించుకోవడం తప్ప తప్పొప్పులు చూడదు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఒక ఘటన దానికి మంచి ఉదాహారణ. పలు దొంగతనాల్లో నిందితుడిగా ఉన్న భర్త కోసం ఏకంగా కోర్టులోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడబోయింది ఓ యువతి. యువతి అంటే 17 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న యువతి (వాస్తవానికి ఈ వయసులో పెళ్లి చేసుకోకూడదనే నిబంధన ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయనుకోండి). కోర్టు విచారణ సందర్భంగా సదరు యువతి చేసిన పనికి ఖిన్నైన కోర్టు సభ్యులు.. పరుగు పరుగున ఆమెకు ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.

Supreme Court: పెద్ద నోట్లరద్దుపై 50కి పైగా పిటిషన్లు.. జనవరి 2న తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లా సెందరై సమీపంలోని ఇడయకురిచ్చి గ్రామానికి చెందిన పురల్చీతమిళ్ (27) అనే వ్యక్తిని ఇటీవల చైనా స్నాచింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై అరియలూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 11 దొంగతనం కేసులు నోమోదై ఉన్నాయి. ఇన్ని కేసులు ఉండడంతో జిల్లా కలెక్టర్ రమణ సరత్వాతి నిందితుడిపై గ్యాంగ్‭స్టర్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం.. కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం పురట్చీని మంగళవారం సెందురై కోర్టులో హాజరుపర్చారు.

Maha vs Karnataka: సంజయ్ రౌత్ చైనా ఏజెంట్.. రౌత్ ‘చైనా తరహా’ వ్యాఖ్యలపై భగ్గుమన్న కర్ణాటక సీఎం

కాగా, పురట్చీని చూసేందుకు అతడి భార్య (17) కోర్టుకు వచ్చింది. విచారణ జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. దీంతో దిగ్ర్భాంతికి గురైన పోలీసులు, ఇతర కోర్టు సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాల నుంచి బయట పడిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆమెకు తన భార్త మాత్రమే ఆధారమని, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు