Maha vs Karnataka: సంజయ్ రౌత్ చైనా ఏజెంట్.. రౌత్ ‘చైనా తరహా’ వ్యాఖ్యలపై భగ్గుమన్న కర్ణాటక సీఎం
చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని మేము అనుకుంటున్నాం. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి అగ్గిరాజేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం బలహీనంగా ఉండడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. చర్చలకు స్వాగతించి, తొందరగా పరిష్కారం చూపితే సరే సరి. లేదంటే మేము కూడా చైనా తరహాలో కర్ణాటకలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎవరి అనుమతి మాకు అక్కర్లేదు
Sanjay Raut is spoiling the unity says karnataka CM
Maha vs Karnataka: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై తీవ్ర స్థాయిలో స్పందించిన శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్ రౌత్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌత్ చైనా ఏజెంటులా మాట్లాడుతున్నారని, ఆయన దేశద్రోహి అంటూ విమర్శలు గుప్పించారు. ఏదైనా ఉంటే చట్టబద్ధంగా తేల్చుకోవాలని, కానీ ఇలా దౌర్జన్యపూరితమైన విధానం తప్పని బొమ్మై హితవు పలికారు. ‘కర్ణాటకలోకి చైనా తరహాలో ఎంటర్ అవుతామంటూ’ వ్యాఖ్యానించడంపై తాము చట్టపరమైన చర్యలకు తీసుకుంటామని బొమ్మై అన్నారు.
ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తల నడుమ సాగుతున్న మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు అంశంలో శివసేన (ఉద్ధవ్ వర్గం) తనదైన శైలిలో స్పందించి వివాదానికి మరింత అగ్గిని రాజేసింది. ‘‘చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని మేము అనుకుంటున్నాం. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి అగ్గిరాజేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం బలహీనంగా ఉండడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. చర్చలకు స్వాగతించి, తొందరగా పరిష్కారం చూపితే సరే సరి. లేదంటే మేము కూడా చైనా తరహాలో కర్ణాటకలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎవరి అనుమతి మాకు అక్కర్లేదు’’ అని శివసేన నేత సంజయ్ రౌత్ బుధవారం తీవ్ర స్థాయిలో స్పందించారు.
Supreme Court: పెద్ద నోట్లరద్దుపై 50కి పైగా పిటిషన్లు.. జనవరి 2న తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు
కాగా, సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై గురువారం సీఎం బొమ్మై స్పందిస్తూ ‘‘ఈ దేశ ఐక్యతను, సామరస్యతను సంజయ్ రౌత్ దెబ్బతీస్తున్నారు. ఆయన చైనా ఏజెంట్ అని నా అనుమానం. నిజంగానే చైనా ఏజెంట్. అలాగే దేశద్రోహి కూడా. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను చల్లబర్చడానికి బదులు మరింత జఠిలం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. వివాదం అంశం కోర్టులో విచారణలో ఉంది. కానీ, మహారాష్ట్రకు చెందిన నేత ఇలా దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదు. ఆయన వ్యాఖ్యలపై మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు.
