Maharashtra: గాంధీతో మోదీకి పోలికేంటి? అమృత ఫడ్నవీస్ ‘ఇద్దరు జాతి పితలు’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్

నాగ్‭పూర్‭లో రచయిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘‘మహాత్మగాంధీ ఈ దేశానికి జాతి పిత. అయితే నరేంద్రమోదీ నూతన భారతానికి జాతి పిత. మనకు ఇద్దరు జాతి పితలు ఉన్నారు. ఒకరు ఈ కాలానికి జాతి పిత అయితే మరొకరు ఆ కాలానికి జాతి పిత’’ అని అన్నారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా అమృత తరుచూ వార్తల్లో ఉంటారు

Maharashtra: గాంధీతో మోదీకి పోలికేంటి? అమృత ఫడ్నవీస్ ‘ఇద్దరు జాతి పితలు’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్

Congress reacts on only one father of nation

Maharashtra: దేశానికి ఇద్దరు జాతి పితలు ఉన్నారంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. మహాత్మ గాంధీతో ఇంకెవరినీ పోల్చలేమని, బీజేపీ చెప్పే కొత్త భారత దేశం కొంత మంది వ్యాపారవేత్తల జేబులు నింపేందని మండిపడింది. గురువారం ఓ కార్యక్రమంలో భాగంగా అమృత చేసిన వ్యాఖ్యలపై ఒక్క కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా, విపక్షాల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి.

Maharashtra: వీఐపీ సెక్యూరిటీకి నిర్భయ నిధులు.. అబ్బబ్బే, ఇది ఉద్ధవ్ సర్కార్ పనే అంటున్న ఫడ్నవీస్

బుధవారం నాగ్‭పూర్‭లో రచయిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘‘మహాత్మగాంధీ ఈ దేశానికి జాతి పిత. అయితే నరేంద్రమోదీ నూతన భారతానికి జాతి పిత. మనకు ఇద్దరు జాతి పితలు ఉన్నారు. ఒకరు ఈ కాలానికి జాతి పిత అయితే మరొకరు ఆ కాలానికి జాతి పిత’’ అని అన్నారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా అమృత తరుచూ వార్తల్లో ఉంటారు. కొద్ది రోజుల క్రితం మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోయిన అనంతరం ఆమె ఒక ట్వీట్ చేశారు. అందులో మరాఠీలో ‘‘ఏక్ థా కపాటీ రాజా’’ అని ట్వీట్ చేశారు. అంటే ‘‘ఒకప్పుడు చెడ్డ రాజు ఉండేవాడు’’ అనేది దాని అర్థం. అయితే ఇది రాజకీయంగా విమర్శలు మూడగట్టుకోవడంతో డిలీడ్ చేశారు.

India-China Clash: లధాఖ్ నుంచి అరుణాచల్ వరకు.. చైనాతో సరిహద్దును గరుడ దళంతో కట్టుదిట్టం చేసిన భారత్

అయితే అమృత వ్యాఖ్యలపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధినేత నానా పటోలే స్పందిస్తూ ‘‘మహాత్మ గాంధీతో ఎవరినీ పోల్చలేము. ఆమె (అమృత ఫడ్నవీస్) చెప్ప కొత్త భారత దేశం కొద్ది మంది స్నేహితులైన వ్యాపారవేత్తల జేబులు నింపేది. కానీ దేశంలో ఆకలితో అలమటిస్తున్న వారిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అలాంటి కొత్త ఇండియా ఎవరికీ అవసరం లేదు. అలాంటి జాతి పిత ఈ దేశానికి అవసరం లేదు’’ అని అన్నారు.