Wife Killed Husband
Wife Who killed husband, for daughter marriage with younger brother : కన్న కూతుర్ని తమ్ముడి కిచ్చి పెళ్లి చేయటానికి అభ్యంతరం చెపుతన్న భర్తను తమ్ముడితో కలిసి భార్య హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పందివారిపల్లెకు చెందిన వడ్డూరి నాగరాజుకు భార్య భాగ్యలక్ష్మి, కూతురు, ఉన్నారు. కూతురు పెళ్లీడు కొచ్చింది. భాగ్యలక్ష్మి తన కూతురుని, తమ్ముడు నవీన్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంది.
మేన కోడల్ని చేసుకోటానికి నవీన్ కూడా ఇష్టపడ్డాడు. కూతుర్నిచ్చి పెళ్లి చేయమని తన బావను అడిగాడు. అందుకు నాగరాజు ఒప్పుకోకపోగా బావమరిదికి, తన భార్యకు అక్రమ సంబంధం ఉందంటూ ఆరోపిస్తూ ..భార్యను రోజూ వేధించసాగాడు.
అక్క, తమ్ముళ్ల మధ్య అక్రమ సంబంధం ఉందంటూ…. మాటలతో బావమరిదిని వేధించసాగాడు. భర్త చేష్టలతో విసిగిపోయిన భాగ్యలక్ష్మి తన కూతుర్ని తమ్ముడికిచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయించుకుంది. ఇందుకోసం భర్తను అడ్డుతొలగించుకోవాలనుకుని తమ్ముడితో కలిసి పధక రచన చేసింది.
ఫిబ్రవరి 12న మద్యం మత్తులో ఇంట్లో నివసిస్తున్ననాగరాజును బండరాయితో తలపై కొట్టి నవీన్ హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఇంటి సమీపంలో గొయ్యి తీసి పూడ్చి పెట్టారు.
కొద్ది రోజులకు నాగరాజు కనిపించటం లేదని .. బంగారు పాళ్యం మండలం, అండరెడ్డి పల్లిలో నివసించే అతని తమ్ముడు గోపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
భాగ్యలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించే సరికి ఈ ఘాతకం బయటపడింది. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు భాగ్యలక్ష్మి నవీన్ లను కోర్టులో హాజరు పరిచారు.