డిసెంబర్ 16న నిర్భయ హంతకులకు ఉరి? 

నిర్భయ హంతకులకు ఉరి శిక్ష అమలు కాబోతుందా? అందుకోసం ఉరి తాళ్లు కూడా సిద్ధమవుతున్నాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న డిబేట్ ఇది.

  • Publish Date - December 10, 2019 / 03:16 AM IST

నిర్భయ హంతకులకు ఉరి శిక్ష అమలు కాబోతుందా? అందుకోసం ఉరి తాళ్లు కూడా సిద్ధమవుతున్నాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న డిబేట్ ఇది.

నిర్భయ హంతకులకు ఉరి శిక్ష అమలు కాబోతుందా? అందుకోసం ఉరి తాళ్లు కూడా సిద్ధమవుతున్నాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న డిబేట్ ఇది. బీహార్‌లోని బక్సర్ జైల్లో తయారవుతోన్న ఉరితాళ్లు… నిర్భయ హంతకుల కోసమే అని ప్రచారం సాగుతోంది. శిక్ష అమల్లో జాప్యంపై వస్తోన్న విమర్శలకు కేంద్రం ఇలా కౌంటర్ ఇచ్చే ఏర్పాటు చేస్తుందంటున్నారు.

సంచలనం కలిగించిన నిర్భయ కేసులో ఏడేళ్లు ఆలస్యమైనా..ఎట్టకేలకు శిక్ష అమలు కాబోతోందా..సోషల్ మీడియాలో ఈ అంశంపై ఒకటే చర్చ నడుస్తోంది..ఐతే ఇది కేవలం వైరల్ డిబేట్ మాత్రమే కాదు..దానికో ఆధారం కూడా చూపుతున్నారు. దేశంలో ఉరితాళ్లు తయారు చేసే ఏకైక చెరసాల బక్సర్‌కి పది ఉరితాళ్లు తయారు చేయాలంటూ ఓ సందేశం వచ్చిందట..జైళ్ల డైరక్టరేట్‌ నుంచి ఈ ఆదేశాలు వచ్చినట్లు బక్సర్ జైలు సూపర్నెంట్ విజయ్ కుమార్ అరోరా కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. దీంతో ఈ ఉరితాళ్లు నిర్భయ హంతకుల కోసమేనంటూ ప్రచారం మొదలైంది.

గత వారమే ఉరి తీసేందుకు అవసరమైన తాళ్లని సిద్ధం చేయాల్సిందిగా తమకి ఆర్డర్స్ అందాయని బక్సర్ జైలు సిబ్బంది చెప్తున్నారు. ఐతే ఇవి ఎక్కడకి వెళ్తాయనేది మాత్రం తెలియదట. ఒక్కో ఉరితాడు తయారు చేయాలంటే మూడు రోజులు పడుతుందట. అందుకే డిసెంబర్ 14నాటికి ఈ ఉరితాళ్లు సిధ్దం చేసి పంపాల్సిందిగా కూడా బక్సర్ జైలు సిబ్బందికి వచ్చిన ఆదేశాల్లో ఉంది. మరోవైపు డిసెంబర్ 16 నాటికి నిర్భయ ఉదంతం చోటు చేసుకుని ఏడేళ్లు పూర్తవుతుంది. అందుకే ..ఆ నరహంతకులు…కామాంధుల తలకి తగిలించేందుకే ఈ ఉరితాళ్ల ఆర్డర్ వచ్చినట్లు అంచనాలు నెలకొన్నాయి.

బక్సర్ జైలు నుంచే అప్జల్ గురుని ఉరి తీసిన సందర్భంలోనూ ఇక్కడ నుంచే ఉరికొయ్యలు వెళ్లాయ్. నిర్భయ కేసులోనూ 2017లోనే నలుగురు దోషులకు ఉరిశిక్ష వేయగా..అమలు మాత్రం కాలేదు..ప్రస్తుతం దేశంలో మహిళలపై అత్యాచారాలకు కఠిన శిక్షలు..సత్వరం అమలు చేయాలన్న డిమాండ్ విన్పిస్తోంది..ఈ నేపధ్యంలోనే నిర్భయ హంతకులను తొందర్లోనో ఉరి తీయడం ఖాయమంటున్నారు..అఁదుకే బక్సర్ జైల్లో ఉరి తాళ్లు సిద్ధం చేస్తున్నారనే వాదనా బలపడుతోంది. 

నిర్భయ హత్యాచారం కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. రామ్ సింగ్ అనే ప్రధాన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి మైనర్ అనే సాకుతో రిలీజయ్యాడు. మిగిలిన నలుగురు నిందితులు.. వినయ్ శర్మ,  పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముకేష్ సింగ్‌లకు కోర్టు 2017లో ఉరిశిక్ష విధించింది. వీరిలో వినయ్ శర్మ పేరుతో ఓ క్షమాభిక్ష పిటీషన్ రాష్ట్రపతి వద్దకు చేరగా..ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రహోంశాఖ దాన్ని తిరస్కరించాల్సిందిగా కోరాయి. 

వినయ్ శర్మ కూడా తాను క్షమాభిక్ష కోరలేదంటూ చెప్పుకొచ్చాడు..ఆ పిటీషన్‌పై సంతకం చేయలేదన్నాడు. ఈ గందరగోళం సాగుతుండగానే..ఇక శిక్ష అమలు కోసం కేంద్రం అడుగులు వేగంగా పడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఉరితాళ్లకి ఆర్డర్ చేశారని అంటున్నారు.