woman arrested for running prostitution : చీరల వ్యాపారం మాటున చీకటి వ్యాపారం
- murthy
- Published On : March 19, 2021 / 03:49 PM IST
Prostitution Business Guntur
woman arrested for running prostitution under matching centre in guntur : చీరల వ్యాపారం చేస్తూ… చీకటి వ్యాపారం కూడా చేస్తున్న మహిళను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసారు. గుంటూరు ఏటీ అగ్రహారం జీరో (0) లైనులో నివాసం ఉండే షేక్ లాల్‌బీ అలియాస్ శ్రీలక్ష్మి, ఇంట్లోనే శ్రీలక్ష్మి మ్యాచింగ్ సెంటర్ పేరుతో చిన్నపాటి బట్టల కొట్టు నడుపుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్‌సంస్ధలో పనిచేసే శ్రీనివాసరావు అనే వ్యక్తిని పదేళ్ళ కిందట వివాహం చేసుకుంది.
అప్పటికే విలాసాలకు అలవాటు పడిన శ్రీలక్ష్మికి తేలికగా డబ్బు సంపాదించాలనే దురాచలోన వచ్చింది. దీంతో తన మ్యాచింగ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహించటం మొదలెట్టింది. తన షాపుకు వచ్చే చిన్న కుటుంబాలకు చెందిన మహిళలు, భర్తను కోల్పోయినవారు, కుటుంబ పరిస్థితులు సరిగా లేనివారు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్న యువతులను గుర్తించి వారిని మభ్యపెట్టి వారికి డబ్బు ఆశ చూపించి వారిని చీకటి కూపంలోకి దింపి వారితో వ్యభిచారం చేయిస్తోంది.
మ్యాచింగ్ సెంటర్ లో వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారం అందుకున్న నగరంపాలెం పోలీసులు మార్చి 17వ తేదీ రాత్రి ఏటీ అగ్రహారంలోని ఆమె నివాసంలో దాడి చేసి నిర్వాహకురాలు శ్రీలక్ష్మి, ముగ్గురు యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
