woman cheated neighbours : చిట్టీల పేరుతో రూ. 4.5 కోట్లు మోసం చేసిన మహిళ

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా సమాజంలో మనీ మోసాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో ఓ మహిళ చిట్టీల పేరుతో రూ.4.5 కోట్ల తీసుకుని పరారయ్యింది. దీంతో 70 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

woman cheated neighbours, in chit business : ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా సమాజంలో మనీ మోసాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో ఓ మహిళ చిట్టీల పేరుతో రూ.4.5 కోట్ల తీసుకుని పరారయ్యింది. దీంతో 70 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

హయత్ నగర్ పరిధిలోని ప్రగతి నగర్ లో సప్పిడి పూలమ్మ అనే మహిళ కొన్నేళ్లుగా చిట్టీలు నడుపుతోంది. స్ధానికంగా సొంతిల్లు కూడా ఏర్పరుచుకుంది. అందరితో కలివిడిగా ఉండేది. దీంతో ఆచుట్టు పక్కల ఉన్న ప్రగతి నగర్, ప్రియదర్శినీ నగర్ కాలనీ, పీఎస్ ఆర్ కాలనీలకు చెందిన పలువురు ఆమె వద్ద చిట్టీలు కట్టారు.

చీటి పాడుకున్నవారికి డబ్బులు ఇవ్వకుండా.. నెలనెలా ఆకర్షణీయమైన వడ్డీ ఇస్తానని చెప్పి ఆడబ్బు తన వద్దే ఉంచుకుంది. తనకు తెలిసిన పలువురి వద్ద అవకాశం ఉన్నంతవరకు అప్పులు చేసింది. చిట్టీలు ఎత్తిన వారికి, అప్పుల వారికి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటూ వచ్చింది.

కాగా శనివారం సాయంత్రం తన సామాగ్రితో ఆ కాలనీ నుంచి వెళ్లిపోవటంతో బాధితులు ఆమె ఇంటివద్ద ఆందోళనకు దిగారు. తనకు సంబంధం లేదని కుమారుడు చెప్పటంతో బాధితులు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.

ట్రెండింగ్ వార్తలు