భర్తతో వివాదం : హుస్సేన్ సాగర్ లో దూకిన మహిళ

భర్తతో వివాదం కారణంగా ఓ మహిళ హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

  • Publish Date - November 23, 2019 / 09:53 AM IST

భర్తతో వివాదం కారణంగా ఓ మహిళ హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

భర్తతో వివాదం కారణంగా ఓ మహిళ హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన శనివారం(నవంబర్ 23, 2019) చోటు చేసుకుంది. హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కు చెందిన మహిళకు తన భర్తతో వివాదం ఉంది. దీంతో మనస్తాపం చెందిన మహిళ శనివారం ఉదయం హుస్సేన్ సాగర్ లో దూకింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ఆమెను కాపాడారు. 

లేక్ పోలీసు కామేశ్వర్ రావు చికిత్స కోసం మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. పోలీసులు ఆమె భర్తకు సమాచారం అందించారు. అతను వెంటనే ఘటనాస్థలికి బయల్దేరారు. 

అయితే భర్తతో వివాదం కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.