జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. తిరుచ్చి సురయార్‌లో జల్లికట్టు నిర్వహిస్తుండగా ఎద్దులు జనాలపైకి దూసుకెళ్లాయి. పోటీలు చూస్తున్న మహాలక్ష్మీ మహిళ మృతి చెందింది. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. సంక్రాంతి పండుగలో భాగంగా మూడో రోజు కనుమ సందర్భంగా…జల్లికట్టు వేడుకలు నిర్వహిస్తుంటారు. మధురై జిల్లా అవనియాపురం, అలంగానల్లూరు, పాలమేడులో పోటీలను తిలకించడానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఎద్దులను అదుపు చేయడానికి యువకులు పోటీ పడుతున్నారు. ఇందుకు పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. ఉన్నతాధికరుల పర్యవేక్షణలో ఈ పోటీలు సాయంత్రం వరకు జరుగనున్నాయి. రాష్ట్ర ప్రజలంతా వేడుకలను చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గాయపడిన వారికి వైద్య చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తమిళనాడులో ఏటా ఈ పోటీలు జరుగుతుంటాయి. మొనతేలిన కొమ్ములతో ఎద్దులు దూసుకొస్తుంటాయి. పశువులు హింసకు గురవుతుంటాయి. కొమ్ములకు టవల్, పలకలు ఏర్పాటు చేస్తుంటారు. వీటిలో బంగారం, విలువైన వస్తువులు, నగదు పెడుతుంటారు. పోటీలో పాల్గొనే వారు వాటి కొమ్ములను పట్టుకుని లొంగదీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది గాయాల పాలవడమే కాకుండా..కొందరు మృతి చెందుతుంటారు. ఈ ఆటను కొనసాగ తీయవద్దని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.
జల్లికట్టు తమ సంప్రదాయమని, సంస్కృతి అని తమిళులంతా ఏకమయ్యారు. ప్రజలకు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన వారు మద్దతు తెలిపారు. అనంతరం సుప్రీంకోర్టు తన ఆదేశాన్ని కొన్ని షరతులతో ఉపసంహరించుకుంది. వేడుకల్లో పాల్గొనే వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాల్లో ఫిట్ నెస్ పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షల అనంతరమే..వారు పూర్తి ఫిట్‌గా ఉన్నారని తేలితేనే..జల్లికట్టులో పాల్గొనడానికి అనుమతినిస్తుంటారు. కానీ ఈ ఏడాది జల్లికట్టులో మహిళ మరణించడం విషాదం నింపింది.
Read More : టికెట్ల లొల్లి : మంత్రి మల్లారెడ్డి డబ్బులు తీసుకున్నాడు..కార్యకర్త ఫోన్ కాల్ వైరల్