అక్రమ సంబంధాలు తప్పు. ఎప్పటికైనా ముప్పే. బయటపడితే ప్రాణాలకే ప్రమాదం. అక్రమ సంబంధాల కారణంగా
అక్రమ సంబంధాలు తప్పు. ఎప్పటికైనా ముప్పే. బయటపడితే ప్రాణాలకే ప్రమాదం. అక్రమ సంబంధాల కారణంగా హత్యలు కూడా జరుగుతున్నాయి. పరువు పోతుందని కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పు రాజేస్తున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఈ తరహా సంబంధాలు నేరం అని పోలీసులు పదే పదే చెబుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు.
కొందరు మహిళలు, పురుషులు వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ కాపురాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. లాక్ డౌన్ కారణంగా ఆమె వ్యవహారం బయటపడింది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. పుణెకు చెందిన రాణికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇంతవరకు వారికి పిల్లలు పుట్టలేదు.
తనకు పిల్లలు పుట్టలేదని భర్తతో తరుచు గొడవపడేది. ఈ క్రమంలో ఆమె పాలు పోసే యువకుడితో పరిచయం పెట్టుకుంది. భర్త ఆఫీస్ కు వెళ్లిన తర్వాత అతడిని పిలిపించుకుని రకరకాల వంటలు చేసిపెట్టేది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో అది అక్రమ సంబంధంగా మారింది. భర్త రోజు ఆఫీస్ కు వెళ్లిన తర్వాత ఇద్దరూ రాసలీలల్లో మునిగి తేలేవారు. చాలా రోజులు ఇలా ఇద్దరూ ఎంజాయ్ చేశారు.
అయితే లాక్ డౌన్ కారణంగా ఆ మహిళ భర్త ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో కొన్నాళ్లు ఇద్దరూ కలుసుకోలేకపోయారు. ఇటీవల భర్త తన ఫ్రెండ్ ఇంటికి అని బయలుదేరాడు. మధ్యాహ్నం వస్తానని చెప్పాడు. భర్త మధ్యాహ్నం వరకు ఇంటికి రానని చెప్పడంతో ఇదే అదనుగా ఆ మహిళ పాలవాడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. అయితే దారిలో పోలీసులు ఆపేయడంతో భర్త అరగంటకే ఇంటికి వచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టినా ఆమె డోర్ తియ్యలేదు. ఎంతసేపటికి డోర్ తియ్యకపోవడంతో అతడికి అనుమానం వచ్చింది. బెడ్ రూమ్ దగ్గర కిటీకి నుంచి చూశాడు. అంతే షాక్ అయ్యాడు. తన భార్య, పాలవాడు నగ్నంగా ఉన్నారు. ఇద్దరూ సెక్స్ చేస్తున్నారు. ఆవేశంతో ఊగిపోయిన ఆ భర్త ఒక్క అరుపు అరిచాడు. ఆ తర్వాత బయటి నుంచి తలుపులు వేసి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ పాలవాడిని, ఆమెని అరెస్ట్ చేశారు. అలా ఆ ఆంటీ అక్రమ సంబంధం వ్యవహారం లాక్ డౌన్ కారణంగా బట్టబయలైంది.
See also : బుర్ఖా వేసుకుని గుడిలో శానిటైజేషన్ చేస్తున్న కరోనా వారియర్
See also : చేతి రాతను నేరుగా కంప్యూటర్‌లోకి కాపీ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?