Woman Protest In Front Of Boyfriend House
Love Cheating : గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది. గూడపాడి బార్గవీ లత..దారాల బాజీ అనే ఇద్దరూ కొన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. మే 24 న ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ బాజీ ఆమెను వదిలించుకోటానికి ప్రయత్నిస్తున్నాడు.
కుటుంబ సభ్యులు తమ పెళ్లిని ఒప్పుకోవటం లేదని.. తమ బాబాయ్ లు,మిగతా కుటుంబ సభ్యులు అంతా బెదిరిస్తున్నారని..నువ్వునాకు వద్దని ఆమెను తప్పించుకు తిరగ సాగాడు.దీంతో ప్రియుడు తనను మోసంచేశాడంటూ బార్గవీ లత మంగళవారం ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తోంది.
గత కొద్ది రోజులుగా ప్రియుడు బాజీ మరియు బంధువులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని యువతి మరియు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. హోంమంత్రి నియోజకవర్గంలోనే ఇలాజరగటంతో పోలీసులుఘటనా స్ధలానికి వచ్చి ఇద్దరికీ సయోధ్య కుదిర్చే పనిలో పడ్డారు.