అన్న భార్యతో తమ్ముడి రాసలీలలు…..ఉద్యోగం కోసం విదేశాలకు అన్న….

  • Publish Date - April 5, 2020 / 06:00 AM IST

అక్రమ సంబంధాల వల్ల మానవ సంబంధాలు ఎంతగా దెబ్బతింటున్నాయో తెలిసి కూడా ప్రజలు వాటివైపే ఆకర్షితులవటం చూస్తుంటే సమాజం ఎటుపోతోందో అని భయం వేస్తుంది. దీని వలన కుటుంబాలు కూలిపోతున్నాయి, మనుషుల మధ్య పొరపొచ్చలు వస్తుంటాయి. 

మాటా మాటా పెరుగుతుంది. కోపాలు, కక్షలు పెరుగుతాయి. సంయమనం కోల్పోయాక ఏమి చేస్తున్నామో కూడా తెలీని పరిస్ధితిలో హత్యలు చేసి హంతకులుగా మారుతున్నారు. నిత్యం పేపర్లలోనూ.. టీవీ చానళ్లలోనూ ఇలాంటి వార్తలు చూస్తున్నా, వింటున్నా వాటికి దూరంగా మాత్రం ఉండటం లేదు. తమిళనాడులోని కడలూరు జిల్లాలోనూ  మరదితో ఎఫైర్ పెట్టుకున్న ఇల్లాలు  మొగుడ్ని కడ తేర్చింది. 
 

కడలూరు జిల్లాలోని హర్బర్ సింగారతోపు అనే గ్రామంలో   ఓ వ్యక్తి కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనే ఉద్దేశ్యంతో పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ  డబ్బు సంపాదించటానికి దుబాయ్ వెళ్లాడు.  అక్కడ  ఉద్యోగం చేస్తూ ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో తన బావ మరిది పెళ్ళికోసమని 2013. జనవరి 6న ఇండియాకి వచ్చాడు.  బావ మరిది పెళ్ళి అయిన తర్వాత  దుబాయ్ వెళ్ళాల్సిన మనిషి కనపడకుండా పోయాడు. ఎమయ్యాడో తెలీదు. 

కొన్నిరోజులకు భార్య తన భర్త కనిపించటంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. కేసు  నమోదు  చేసుకున్న పోలీసులు వెతకటం మొదలెట్టారు. కానీ  దొరకలేదు.  కంప్లయింట్ ఇచ్చిన కొన్నిరోజులకు ఆమె కేరళకు మకాం మార్చింది.  

కంప్లంయింట్ ఇచ్చిన మహిళ తన భర్త గురించి మళ్లీ  పోలీసులను ఎంక్వైరీ చేయకపోయే సరికి అనుమానంవచ్చి ఆమె గురించి వాకబు చేశారు. అయితే ఆమె కేరళ వెళ్ళినట్లు తెలుసుకున్నారు.  అప్పటినుంచి ఆమె కొసం వెతగ్గా ఇటీవలే దొరికింది. పోలీసు విచారణలో షాకింగ్ విషయాలు బయట పడ్డాయి. 
 

భర్త డబ్బు సంపాదన కోసం దుబాయ్ వెళ్ళటంతో ఆ మహిళ తన మరిదితో   వివాహేతర సంబంధం పెట్టుకుంది.  భర్త ఏళ్ల తరబడి దుబాయ్ లోనే ఉండటంతో మరిదితో  ఎంజాయ్ చేయటం మొదలెట్టింది. అన్నభార్య అనికూడా చూడకుండా అతను ఆమెతో ఎఫైర్ కొనసాగించటం మొదలెట్టాడు. బావ మరది పెళ్ళికి ఇండియా వచ్చిన ఆ వ్యక్తికి భార్య  ప్రవర్తనపై అనుమానం కలిగి ఆమెను తీవ్రంగా మందలించాడు.  

దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న ఆమె మరిది సాయంతో భర్తను హత్య చేసి పూడ్చి పెట్టింది. కొన్ని రోజులకు భర్త కనిపించటంలేదని  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు భర్తకోసం వెతుకుతుండగా మరిదితో కలిసి కేరళ పారిపోయింది.  పోలీసులు వీరిద్దరి గురించి గత 6 ఏళ్లుగా వెతుకుతుంటే ఇటీవల కేరళలో దొరికారు.