మంత్రి గంటా శ్రీనివాస్ రావుపై వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ రావు తీవ్ర విమర్శలు చేశారు.
విశాఖ : మంత్రి గంటా శ్రీనివాస్ రావుపై వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గంటా టార్గెట్ భీమిలి కాదు.. అమరావతి అని, సీఎం కుర్చీ అన్నారు. గంటా శ్రీనివాస్ తో మంత్రి లోకేష్ జాగ్రత్తగా ఉండాలని అవంతి సూచించారు. గంటా అనే పామును జేబులో పెట్టుకుని చంద్రబాబు తిరుగుతున్నారని పేర్కొన్నారు. నమ్మిన వారిని మోసం చేయడంలో గంటా..చంద్రబాబును ఫాలో అవుతున్నారని విమర్శించారు. గంటా లాగా తాను మోసం చేసే వ్యక్తినికానన్నారు.
అనకాపల్లి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న గంటా.. భీమిలి ఎందుకు రావాల్సివచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. గంటా లాగా.. తాను తీసుకెళ్లే కార్యకర్తలను మోసం చేసే వ్యక్తినికానన్నారు. గంటా విలువల గురించి అయ్యన్నపాత్రుడు చెబుతారని తెలిపారు. గంటా… ఎలా రాజకీయాల్లోకి వచ్చారు.. ఆయన ఎలా తీసుకొచ్చారు… జిల్లాలో ఎలా తిప్పారో చెబుతారని పేర్కొన్నారు. ఆయ్యన్నపాత్రుడికి గానీ, పార్టీకి గానీ తిరిగి గంటా ఎం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు గంటా అనే పామును జేబులో పెట్టుకుని తిరుగుతున్నారని పేర్కొన్నారు.
గంటా ఉద్దరిస్తాడని…కార్యకర్తలు అనుకోవద్దన్నారు. గంటా.. ఐదు సంవత్సరాలుగా మంత్రిగా ఉండి ఒక్క రోజు కూడా జిల్లా సర్వసభ్య మీటింగ్ కు అటెండ్ కాలేదని విమర్శించారు. ’నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసే మనిషిని అన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు.. గంటా నీతులు వల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. గంటా ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నాడని.. భీమిలలో ఎవరిని అడిగినా ఆయన ఎథిక్స్ చెబుతారని పేర్కొన్నారు.