కులాలు వేరవటంతో ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. బాధతో ప్రేయసి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. తమిళనాడులోని తిరుత్తణి సమీపంలోని నల్లాట్టూరు గ్రామానికి చెందిన మణి కుమార్తె మనిమేఘలై (20), సమీపంలోని తాళవేడు గ్రామానికిచెందిన మునిరత్నం కుమారుడు రాజ్ కుమార్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
రాజ్ కుమార్ ప్రైవేట్ పాలిటెక్ని కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. వీరిద్దరి కులాలు వేరు కావటంతో రాజ్ కుమార్ కుటుంబీకులు వీరి పెళ్లికి అభ్యంతరం చెప్పారు. దీంతో మనిమేఘలై మనిద్దరం పెళ్లి చేసుకుందామని రాజ్ కుమార్ ను ఎన్ని సార్లు కోరినా అతను పట్టించుకోలేదని తెలిసింది.
దీంతో మనిమేఘలై తీవ్ర మనస్తాపానికి గురైంది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కనకమ్మ సత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.