యువతి ఆత్మహత్యా యత్నం: వేధింపులే కారణం 

  • Publish Date - April 16, 2019 / 08:03 AM IST

హైదరాబాద్: సమాజంలో మహిళల పట్ల నానాటికి పురుషుల అరాచకాలు ఎక్కువవుతున్నాయి. రెండు రోజుల క్రితం  చైతన్యపురిలో ఓయువతికి మందు పార్టీ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన మరువక ముందే కూకట్ పల్లి లో ఓ యువతి వేధింపులు తట్టుకోలేక  ఆత్మహత్యాయత్నం  చేసింది. కె.పి.హెచ్.బి కాలనీ 9వ ఫేస్ లో నివాసం ఉండే సిద్దిరాల జ్యోతి అనే యువతి  అదే ప్రాంతంలో ఉండే  రాకేష్ రెడ్డి అనే యువకుడి వేధింపులు తట్టుకోలేక కూల్ డ్రింకులో విషం కలుపుకుని ఆత్మహత్య యత్నం చేసుకుంది.

వెంటేనే కుటుంబ సభ్యలు జ్యోతి ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
Read Also : మహిళను ఈడ్చుకెళ్లిన మెట్రో రైలు : తలకు తీవ్రగాయాలు