యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

  • Publish Date - January 10, 2020 / 12:57 PM IST

వరంగల్ జిల్లా  హన్మకొండ లోదారుణం జరిగింది. రామ్ నగర్ లో హారతి అనే యువతి గొంతుకోసి చంపాడు ఓ ఉన్మాది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ యువతి మృతి చెందింది. రాంనగర్ లో షాహిద్ అనే యువకుడు   హారతి అనే యువతిని గొంతుకోసి చంపాడు.  

మహిళలు పై అకృత్యాలు చేసేవారిని శిక్షించేందుకు ఎన్ని చట్టాలు చేస్తున్నా మహిళలు, యువతులపై మృగాళ్ల అకృత్యాలు ఆగటం లేదు. ఇటీవలే జరిగిన మానస ఘటన మరువక ముందే ఈ ఘటన జరగటంతో స్ధానికులు షాక్ అయ్యారు. 

షాహిద్ గత కొంతకాలంగా  హారతిని ప్రేమ  పేరుతో వేధిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం మధ్యాహ్నం కూడా యువతి ఇంటివద్దకు వచ్చిన షాహిద్ ఆమెతొ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో షాహిద్  యువతి గొంతు కోశాడు. తనను నిర్లక్ష్యం చేస్తోందనే అసహనంతోనే అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.  అనంతపం పోలీసుస్టేషన్ కు వెళ్లి లొంగి పోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు.  చికిత్సపొందుతూ యువతి కన్నుమూసింది.