Man Kills His Girl Friend
Love Tragedy : పెళ్లికి నిరాకరించిందనే కోపంతో, ప్రియుడు, తన ప్రియురాలిని గొంతు కొసి దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని టూ టౌన్ 8వ కాలనీలో జరిగింది. కెకె నగర్ కు చెందిన గొడుగు అంజలి అనే యువతి తారకరామారావు నగర్ కు చెందిన చాట్ల రాజు అనే యువకుడు గత మూడేళ్లుగా ఒకరినొకరు ప్రేమించు కుంటున్నారు.
వీరిద్దరి కులాలు వేరు కావడంతో అంజలి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి అంజలి మనిద్దరం పెళ్లి చేసుకోలేము..నువ్వు నాతో మాట్లాడ వద్దంటూ రాజుతో చెప్పింది. అయినప్పటికీ పెళ్లి చేసుకోవాలంటు రాజు వేధింపులకు గురి చేయటంతో రెండుసార్లు ఇరు కుటుంబాల మధ్య పంచాయతీ జరిగింది.
Also Read : Ganja Seized : షాద్‌నగర్‌లో ఐదున్నర కిలోల గంజాయి స్వాధీనం
కాగా…. అక్టోబర్ 9వ తేదీ,మంగళవారం.. అంజలీ వాళ్ల ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో రాజు వెళ్ళి ఆమెతో పెళ్ళి విషయం ప్రస్తావించాడు. ఆమె పెళ్ళికి నిరాకరించడంతో ఆగ్రహంతో ఇంట్లోని కత్తి పీటతో అంజలి గొంతు కోసి హతమార్చాడు. అంజలి అక్కడిక్కడే రక్తపు మడుగులో తుది శ్వాస విడిచింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్దలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.