Ganja Seized : షాద్‌నగర్‌లో ఐదున్నర కిలోల గంజాయి స్వాధీనం
గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Ganaja Seized
Ganja Seized : గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలికట్ట గ్రామం వద్ద నిన్న రాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద నుండి 5.5 కిలోల గంజాయి దొరికినట్లు పట్టణ సీఐ నవీన్ కుమార్ తెలిపారు.
Also Read :Extra Marital Affair : వివాహేతర బంధం… అతనికి 20, ఆమెకు 25, నెలలోపే ఇద్దరూ….!
వీరిలో ఒరిస్సా రాష్ట్రం భద్రాద్రి జిల్లాకు చెందిన కాళిదాస్ పూర్ గ్రామానికి చెందిన రతికాంత (44), మరో మహిళ అంబిక (45), లతో పాటు మరో ఇద్దరు ప్రశాంత్, సిప్పులను అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. వీరు అందరూ ఒక కంపెనీలో పని చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి వద్ద ఉన్న ఐదున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.