పాతకక్షలు ప్రాణం తీశాయి : యువకుడి దారుణ హత్య  

రాజన్నసిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. పాతకక్షలకు నిండు ప్రాణం బలైంది.

  • Publish Date - January 9, 2019 / 07:35 AM IST

రాజన్నసిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. పాతకక్షలకు నిండు ప్రాణం బలైంది.

రాజన్నసిరిసిల్ల : జిల్లాలో దారుణం జరిగింది. పాతకక్షలకు నిండు ప్రాణం బలైంది. ఓ యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని వ్యవసాయ బావిలో పడేసి పరారయ్యారు. ఈ ఘటన నర్సింగపూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చందుర్తి మండలం నర్సింగపూర్ లో నిన్న రాత్రి హరీష్ అనే యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని వ్యవసాయ బావిలో పడేసి, పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని బావిలో నుంచి మృతదేహాన్ని బయటికి తీశారు. అదే గ్రామానికి చెందిన రమేష్ గౌడ్, శంకర్ లు హరీష్ ను హత్య చేశారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో రమేష్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. అతని ఇంటిని మృతుని బంధువులు ధ్వంసం చేశారు. పోలీసులు అడ్డుకున్నా ఆగకుండా ఇంటిపై దాడి చేశారు. రమేష్, శంకర్ లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

గతం నుంచి రమేష్, హరీష్ మధ్య భూతగాదాలు జరుగుతున్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. రమేష్, హరీష్ కు మధ్య గతంలో కూడా గొడవ జరిగింది. అయితే ఆ గొడవను దృష్టిలో ఉంచుకుని హరీష్ ను రమేష్ హత్య చేసి ఉంటాడని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రమేష్ తలపై బలమైన గాయం ఉంది. గొడ్డలితో నరికి ఉంటారని అందుకే తల తెగిపోయి ఉందని చెబుతున్నారు. ఆగ్రహావేశాలతో గ్రామస్తుల ఊగిపోతున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.