మహిళలపై దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కఠినమైన చట్టాలున్నాయని తెలిసినా..కామాంధులు మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. రోజుకో ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అత్యాచారాలు..ఆపై హత్యలు చేయడం కలకలం రేకేత్తిస్తున్నాయి. తాజాగా ఓ ఈవెంట్ ఆర్గనైజర్‌పై యువకులు రెచ్చిపోయారు. నగ్నంగా డ్యాన్స్‌లు చేయాలంటూ హుంకరించారు. చేయనన్న పాపానికి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. చివరకు యువకుల నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది ఆ ఈవెంట్ ఆర్గనైజర్. ఈ ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…
బర్త్ డ్ సెలబ్రేషన్ కోసం ఓ మహిళ ఈవెంట్ ఆర్గనైజర్ కాంట్రాక్టు తీసుకుంది. అనుకున్నట్లుగానే ఆమె కార్యక్రమం నిర్వహిస్తోంది. మద్యం మత్తులో ఉన్న యువకులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. ఆమె భయబ్రాంతులకు గురయ్యింది. బట్టలు విప్పి నగ్నంగా డ్యాన్స్‌లు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. దాడికి కూడా పాల్పడ్డారు. మహిళను అక్కడే బంధించి చిత్ర హింసలకు గురి చేశారు. యువకుల నుంచి తప్పించుకున్న ఆ మహిళ రాజేంద్ర నగర్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Read More : ఢిల్లీలో విధ్వేశ శక్తులకు కళ్లెం వేసేది ఎవరు ? : సంయమనం పాటించాలి