లవ్ ఫెయిల్యూర్ అని వాట్సప్ స్టేటస్..అంతలోనే శవమయ్యాడు

  • Publish Date - February 17, 2020 / 06:04 AM IST

తన లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని వాట్సప్ లో సెల్ఫీవీడియో తీసి పోస్టు చేసిన వ్యక్తి గంట తర్వాత శవమై తేలాడు. లవ్ ఫెయిలైందని సూసైడ్ చేసుకున్నాడా…. కావాలనే ఆటోనూ ఢీ కొట్టి మృతి చెందాడా…లేక ప్రమాదవశాత్తు జరగటం వల్ల ఆటోనూ ఢీ కొట్టి మరణించాడో తెలియదు కానీ ఒక యువకుడు నిన్న రోడ్డు ప్రమాదంలో  కన్నుమూశాడు.

కామారెడ్డి మండలం ఉగ్రవాయి వద్ద ఫిబ్రవరి16, ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజంపేటకు చెందిన ఎల్కంటి ప్రదీప్ గౌడ్ మృత్యువాత పడ్డాడు. ప్రదీప్ చదువు మానేసి స్ధానికంగా ఉన్నకల్లు డిపోలోనూ, వైన్ షాపుల్లోనూ పవిచేసాడని ఈ మధ్య కొంత కాలం నుంచి ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నట్లు తండ్రి వెంకటి గౌడ్ తెలిపాడు.

ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్ళిన ప్రదీప్ రాత్రి 8 గంటల సమయంలో కామారెడ్డి-సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఉగ్రవాయి స్టేజీకి కొద్ది దూరంలో ఉన్న సాయిబాబా గుడి వద్ద ఆటో ఢీకొట్టడంతో మరణించాడు. సంఘటన స్థలాన్ని దేవునిపల్లి పోలీసులు పరిశీలించి విచారిస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
 

గంట ముందే వాట్సాప్‌ స్టేటస్‌ వీడియో 
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ప్రదీప్‌గౌడ్‌ ప్రమాదం జరగటానికి ఒక గంట ముందు Whats app లో  online లో ఉన్నాడు. బైక్‌ నడిపిస్తూ తన cell phone తో లవ్‌ ఫెయిల్యూర్‌ అంటూ షార్ట్ సెల్ఫీ వీడియో తీసి whats app status పెట్టాడు. whats app status  పోస్టు చేసిన గంట తర్వాత అతడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందరిని కలచి వేసింది. అతను ఎక్కడికి వెళ్లాడు, ఏం జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

లవ్‌ ఫెయిల్యూర్‌ అయిందంటూ అతను ఏడుస్తూ స్టేటస్‌ పెట్టడం…అనంతరం కొద్ది సేపటికే మృత్యువాతపడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి పెద్ద ఎత్తున  తరలివచ్చిన బంధువులు, స్నేహితులు మృతదేహాన్ని చూసి  భోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read More>>క్రేజీ ఫోటో : పెళ్లి శుభలేఖపై ‘ఐ లవ్ కేజ్రీవాల్’