Hyderabad : ఆఫీసులోకి వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యం
ప్రముఖ మల్టీనేషనల్ సాఫ్ట్‌వేర్ ఆఫీసులోకి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది
- chvmurthy
- Published On : December 29, 2021 / 07:44 AM IST
Gachibowli Young Woman Missing
Hyderabad : ప్రముఖ మల్టీనేషనల్ సాఫ్ట్‌వేర్ ఆఫీసులోకి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన నిరీషా (27) అనే మహిళ గచ్చిబౌలిలోని ప్రముఖ మల్టీనేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. కోవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఆమె ల్యాప్ టాప్ కంపెనీలో ఇవ్వటానికి తల్లితండ్రులను తీసుకుని సోమవారం హైదరాబాద్‌లో కంపెనీ వద్దకు వచ్చింది.
సోమవారం ఉదయం వారిని గేటు బయట ఉంచి తాను లోపలికి వెళ్లింది ల్యాప్ టాప్ ఇవ్వటానికి…. రెండు గంటలైనా ఆమె ఆఫీసు నుంచి బయటకు రాలేదు. ఈ లోపల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ కూతురు లింగంపల్లిలో ఉఁదని చెప్పి ఆమెతో మాట్లాడించారు.
Also Read : Gold price Today : గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర
అక్కడికి వెళ్ళిన కొద్ది సేపటికే మళ్లీ ఫోన్ చేసి మీ కూతురు జేఎన్టీయూ వద్ద ఉందని చెప్పడంతో ఆమె తల్లి తండ్రులు అక్కడికి వెళ్లారు. అక్కడకు కూడా కనిపించలేదు. ఆమె నెంబర్‌కు ఫోన్ చేయగా…. స్విఛ్చాఫ్ వచ్చింది. సాఫ్ట్ వేర్ ఆఫీసులోకి వెళ్లిన మహిళ ఎలా, ఎప్పుడు బయటకు వచ్చిందో అర్ధంకాని మహిళ తల్లి తండ్రులు మంగళవారం గచ్చిబౌలీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
