Cheating Marriage : ఒకరికి తెలియకుండా ఒకరిని మూడు పెళ్ళిళ్లు చేసుకున్న యువతి
ఒకరికి తెలియకుండా ఒకరిని ముగ్గురిని పెళ్లిచేసుకున్న యువతి ఉదంతం నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది.
- chvmurthy
- Published On : May 27, 2022 / 04:13 PM IST
Marriage
Cheating Marriage : ఒకరికి తెలియకుండా ఒకరిని ముగ్గురిని పెళ్లిచేసుకున్న యువతి ఉదంతం నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది. నంద్యాల మండలం మిట్నాలకు చెందిన జసింట(24) అలియాస్ శిరీష అనే యువతి మూడు పెళ్ళిళ్లు చేసుకుంది. వీరిలో ఏ ఒక్క భర్తకు విడాకులు ఇవ్వకపోవటం ఇక్కడ గమనార్హం.
వివరాల్లోకి వెళితే మిట్నాలకు చెందిన మేరీ జసింటా అలియాస్ మేరమ్మ కూతురు శిరీష కు గతంలో అవుకు మండలం చెన్నంపల్లెకు చెందిన పాణ్యం మల్లికార్జునరావుతో మొదటి వివాహం అయ్యింది. అతనితో విడాకులు తీసుకోకుండానే ఆత్మకూరు మండలం కొత్తపల్లెకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్తతో విడాకులు తీసుకోకుండానే బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్ రంగాపురంకు చెందిన మహేశ్వర రెడ్డిని పెళ్లి చేసుకోటానికి ఒప్పుకుంది.
మహేశ్వర రెడ్డికి కూడా రెండో పెళ్లి కావటంతో తనకు సెక్యూరిటీగా రూ. 5 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో మహేశ్వరరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆమె పేరుతో రూ.5 లక్షలు డిపాజిట్ చేశాడు. అనతరం వారిద్దరూ ఫిబ్రవరి 5వ తేదీన మద్దిలేటి స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు.
అనంతరకాలంలో శిరీష తల్లి మేరమ్మ తరచూగా ఆర్ఎస్ రంగాపురం వస్తూ తనకూతురుని అత్తారింట్లో ఉంచాలంటే మరిన్ని డబ్బులు, కొంత ఆస్తి రాయాలని డిమాండ్ చేయటం ప్రారంభించింది. పెళ్లికి ముందు రూ.5 లక్షలు డిపాజిట్ చేశాను… మళ్లీ ఈ కొత్త ప్రతిపాదన ఏంటని అనుమానం వచ్చిన మహేశ్వర రెడ్డి శిరీష గురించి ఎంక్వైరీ చేయగా ఆమెకు ఇప్పటికే రెండువివాహాలు అయిన సంగతి తెలుసుకుని షాకయ్యాడు. వెంటనే పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.
Also Read : Karate Kalyani : అసభ్యకర యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కళ్యాణి ఫిర్యాదు
