Young woman protests in front of lover’s house : అయిదేళ్లుగా ప్రేమించుకుంటూ చెట్టా పట్టాలేసుకుతిరిగిన ప్రియుడు పెళ్లి చేసుకోమనే సరికి ముఖం చాటేయటంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. నారాయణపేట జిల్లా ఊటుకూరు మండలంలోని గుంతలగిరి వీధికి చెందిన యువతి గాంధీనగర్ కు చెందిన నయీముద్దీన్ అయిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామని ఆ యువతి ప్రియుడ్ని కోరింది. అందుకు అతడు అంగీకరించలేదు.
దీంతో యువతి నారాయణపేట సఖి కేంద్రంలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా పెళ్లి చేసుకోటానికి ప్రియుడు నిరాకరించాడు. చేసేదేమిలేక యువతి సోమవారం ప్రియుడి ఇంటిముందు మౌనపోరాటానికి దిగింది. ఆమెకు మద్దతుగా పలువురు యువకులు అక్కడ బైఠాయించారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బాధిత యువతి పేర్కోంది.