మరో వివాదంలో పీవీపీ… ఇంటికి వెళ్లిన పోలీసులపై కుక్కలను ఉసిగొల్పిన అనుచరుడు!

  • Publish Date - June 29, 2020 / 05:53 PM IST

వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. బెదిరింపుల కేసులో నోటీసులు ఇచ్చేందుకు పీవీపీ నివాసానికి వెళ్లిన పోలీసులపై ఆయన అనుచరుడు ఖలీద్ కుక్కలను ఉసిగొల్పాడు. భయంతో బంజారా హిల్స్ పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పీవీపీకి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో ఖలీద్ కుక్కలను వారిపైకి వదిలినట్టు ఆరోపిస్తున్నారు పోలీసులు. పీవీపీ అనుచరుడు ఖలీద్ నిర్వాహకంపై ఎస్ ఐ హరీశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో నిందితుడు ఖలీద్‌పై 353 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కుక్కలను వదిలినందుకు కొత్త సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.

Read:రఘురాంపై ఎంపీ బాలశౌరిని అస్త్రంగా సంధించిన వైసీపీ