30% సిలబస్ తగ్గింపు… కొత్త క్యాలెండర్ రూపొందిస్తున్న విద్యా శాఖ

  • Publish Date - July 2, 2020 / 07:36 PM IST

కరోనా వైరస్ కారణంగా ఈ విద్యా సంవత్సరం (2020) ఆన్లైన్ తరగతుల విధానంలోనే ప్రస్తుతం నడుస్తోంది. పరిస్థితి సాధారణం అయ్యేవరకూ ఇదే విధంగా ఆన్లైన్ తరగతులు విద్యా సంవత్సరం గడుస్తుంది. అయితే పరిస్థితి నిమిత్తం అయిన తర్వాత డైరెక్ట్ గా తరగతులు చెప్పడానికి గల క్యాలెండర్ ను విద్యా శాఖ ప్రాథమిక ఎకాడమీ తయారుచేస్తుంది.

అంతేకాదు పాఠ్యాంశాలను 30శాతం తగ్గిస్తున్నారు. దీనివల్ల పనిదినాలు తగ్గినా విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. పరీక్షలు విధించే షెడ్యూల్లో కూడా మార్పులు చేయనున్నారు.

ఇక అండర్ గ్రాడ్యుయేషన్ లో మొదటి సెమిస్టర్ వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాలని విద్యా మండలి కోరుతుంది. ఇందుకు చర్యలు చేపడుతోంది.

2020 విద్యా సంవత్సరం:

* పాఠశాలలు నడిచే 180 రోజులలో… సాధారణ పరిస్థితి వచ్చే వరకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత నేరుగా క్లాసులు చెబుతారు.

* సంక్రాంతి దసరా వంటి పండుగలకు ఇచ్చే సెలవులను తగ్గిస్తారు.

* మార్చ్ లో నిర్వహించాల్సిన పరీక్షలను ఏప్రిల్ కు పోస్ట్ చేయడం, 6 నుంచి 9 తరాగతులవారికి మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించేలా క్యాలెండర్ను రూపొందిస్తున్నారు.

* మే రెండవ వారం నుంచి జూన్ 12, 2021 వరకు సెలవలు ఇచ్చి… తర్వాత ఎలాంటి మార్పులు లేకుండా వచ్చే విద్యా సంవత్సరానికి కొనసాగిస్తారు.