TOEFL Exam : ఏపీలో టోఫెల్ పరీక్ష విజయవంతం.. హాజరైన 4.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

TOEFL Exam : విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాలను అందించడానికి ఏపీ ప్రభుత్వం, ప్రిన్స్‌టన్ ఆధారిత ఈటీఎస్ గత జూన్ 23, 2023న ఒప్పందంపై సంతకం చేశాయి.

TOEFL Exam : ఆంధ్రప్రదేశ్‌లోని 4.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆంగ్ల భాష నైపుణ్యాల కోసం టోఫెల్ ప్రిపరేటరీ (TOEFL) పరీక్షకు హాజరయ్యారని అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13,104 పాఠశాలల్లో 3 నుంచి 5 తరగతులకు చెందిన విద్యార్థులు ఉన్నారు. 13,104 పాఠశాలల్లోని 4,53,265 మంది విద్యార్థులకు 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు టోఫెల్ పరీక్ష విజయవంతంగా నిర్వహించారు.

సుదూర గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కావడం హర్షణీయమని సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఏప్రిల్ 12న 5,907 పాఠశాలల్లోని 16.5 లక్షల మందికి పైగా (6 నుంచి 9వ తరగతి వరకు) విద్యార్థులకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తారని ప్రకాశ్ పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాల కోసం మూల్యాంకనాలను అందించడానికి ఏపీ ప్రభుత్వం, ప్రిన్స్‌టన్ ఆధారిత ఈటీఎస్ జూన్ 23, 2023న ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ సహకారంతో అకడమిక్ ఎక్సలెన్స్‌ను ప్రోత్సహించడంతో పాటు లక్షలాది మంది విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

ట్రెండింగ్ వార్తలు