Campus Drive: పాలిటెక్నీక్ కాలేజీలో క్యాంపస్ డ్రైవ్.. రెండు లక్షలు జీతం.. వెంటనే అప్లై చేసుకోండి

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో జూన్ 30వ తేదీన క్యాంపస్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు.

Campus drive at Amadalavalasa Polytechnic College

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఏదైనా మంచి కంపెనీలో జాబ్ చేయాలని చూస్తున్నారా? అయితే ఈ అవకాశం కోసమే. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో జూన్ 30వ తేదీన క్యాంపస్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు. ఈ మేరకు కాలేజీ ప్రిన్సిపల్ ప్రకటన చేశారు. ఈ క్యాపస్ డ్రైవ్ లో మొత్తం 10 కంపెనీలు పాల్గొంటాయని, 450 ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన తెలిపారు. కాబట్టి, యువతకు ఇది మంచి అవకాశం అని తప్పకుండ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

విద్యార్హత: టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ పూర్తి చేసిన స్త్రీ పురుషులు ఎవరైనా ఈ క్యాంపర్ డ్రైవ్ లో పాల్గొనవచ్చు.

వయోపరిమితి: ఈ క్యాంపర్ డ్రైవ్ లో పాల్గొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

జీతం వివరాలు: ఈ క్యాంపర్ డ్రైవ్ లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14000 నుంచి రూ.20000 వరకు జీతం అందిస్తారు.

ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

నిజానికి నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. మీలో ఎవరైనా చదువు అయిపోయి జాబ్స్ కోసం చూసేవాళ్లు ఉంటె వెంటనే ఈ క్యాంపర్ డ్రైవ్ లో పాల్గొనడం మంచిది.