Prasar Bharati Recruitment : ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పార్ట్ టైమ్ కరస్పాండెంట్ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే వారి వయసు 24 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిచేసిన దరఖాస్తులను అన్ని ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
- Guntupalli Ramakrishna
- Published On : October 20, 2023 / 01:01 PM IST
Prasar Bharati
Prasar Bharati Recruitment : విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్(పీటీసీ) ఖాళీలను భర్తీ చేయనుంది. కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైమ్ కరస్పాండెంట్లు నియామకాలు చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Rahul Gandhi : ఇవి దొరల తెలంగాణకు, ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు : రాహుల్ గాంధీ
దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిగ్రీతోపాటు న్యూస్ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్థులు జిల్లా కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల లోపు నివాసం ఉంటున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, ఏలూరు, బాపట్ల, నంద్యాల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, విజయవాడ-అమరావతి (క్యాపిటల్ పరిధిలో).జిల్లాలలో ఈ ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Onion Cultivation : ఉల్లి గడ్డ సాగుకు అనువైన రకాలు..
దరఖాస్తు చేసుకునే వారి వయసు 24 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిచేసిన దరఖాస్తులను అన్ని ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. అర్హతలు, అనుభవం అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
READ ALSO : Sesame Cultivation : వేసవి నువ్వు సాగులో చీడపీడల నివారణ
పూర్తిస్ధాయి వివరాలకు అభ్యర్థులు 94406 74057 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఫోన్ సేవలు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: కార్యాలయ అధిపతి, ఆకాశవాణి, MG రోడ్, విజయవాడ-520002.దరఖాస్తుల అందజేసేందుకు చివరితేది: 30.10.2023గా నిర్ణయించారు.
Air-Recruitment
