Onion Cultivation : ఉల్లి గడ్డ సాగుకు అనువైన రకాలు..

నీరు నిలువని సారవంతమైన ఎర్రనేలలు, మెరకనేలలు, అధిక సేంద్రియ పదార్థాలు గల ఇసుక నేలలు అనుకూలం. చౌడు,క్షారత్వం, నీరు నిలువ ఉండే భూములు పనికిరావు. ఉదజని నూచిక 5.8-5.5 ఉన్న నేలలు అనువైనవి.

Onion Cultivation : ఉల్లి గడ్డ సాగుకు అనువైన రకాలు..

onion farming

Onion Cultivation : ఉల్లిగడ్డ సుగంధ ద్రవ్య పంటలలో ముఖ్యమైనది. తెల్ల ఉల్లిగడ్డ రకాలు ఘాటు తక్కువగా ఉంటాయి. చక్కెర పదార్ధాలు అధికంగా ఉండి వంటకాలలో ఉపయోగించటానికి అనుకూలంగా ఉంటాయి. ఉల్లిని రబీలో సాగు చేస్తారు. అక్టోబరు రెండవ వారంలో నారు కోసం విత్తుకుంటే దిగుబడి బాగా వస్తుంది. ఖరీఫ్ లో అయితే జూన్, జులై లోనూ, వేసవి పంటగా జనవరి , ఫిభ్రవరిలో నాటుకోవాలి. తెలుగు రాష్టాలకు చెందిన రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. కొన్ని రకాలు తెలుగు రాష్ట్రా నేలలకు అనుకూలంగా ఉంటాయి.

READ ALSO : Ragging : గాంధీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కు పాల్పడిన మరో విద్యార్థి సస్పెండ్

నీరు నిలువని సారవంతమైన ఎర్రనేలలు, మెరకనేలలు, అధిక సేంద్రియ పదార్థాలు గల ఇసుక నేలలు అనుకూలం. చౌడు,క్షారత్వం, నీరు నిలువ ఉండే భూములు పనికిరావు. ఉదజని నూచిక 5.8-5.5 ఉన్న నేలలు అనువైనవి.

ఉల్లి గడ్డ సాగుకు అనువైన రకాలు ;

ఎర్ర ఉల్లి రకాలు ;

బళ్ళారి రెడ్ ; గడ్డలు పెద్దగా ఉంటాయి. ఘాటు తక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సాగు చేయడానికి అనువైన రకం.

నాసిక్‌రెడ్‌ (ఎస్‌-5: గడ్డలు మధ్యస్థంగా ఉండి, ఎర్రగా ఉంటాయి. ఖరీఫ్‌, రభీలకు అనువైన రకం దిగుబడి. 80 క్వింటాళ్ళు ఎకరానికి వస్తుంది.

ఆర్కకళ్యాణ్ ; ఖరీఫ్‌ అనువైన ముదురు గులాబీ రంగు రకం. ఇది ఆకుమచ్చ తెగులును తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. దిగుబడి 188 క్వింటాళ్ళు ఎకరానికి వస్తుంది.

READ ALSO : Sesame Cultivation : వేసవి నువ్వు సాగులో చీడపీడల నివారణ

అర్క ప్రగతి: నాటిన 130 రోజులకు కోతకు వస్తుంది. నిల్వ నాణ్యత ఉంటుంది. దిగుబడి 180 క్వింటాళ్ళు   ఎకరానికి వస్తుంది.

పసుపు రంగు ఉల్లి రకాలు ;

ఎర్లీగ్రానో ; తక్కువ ఘాటు కలిగి, సలాడ్ గా వాడటానికి అనువైనవి. దిగుబడి 188 క్వింటాళ్ళు వస్తుంది. నిల్వ, నాణ్యత ఎక్కువగా ఉంటుంది.

ఆర్క పితాంబర్ ; యూరప్‌ దేశాలకు ఎగుమతికి అనువైన రకం. ఒక్కో ఉల్లిగడ్డ 80 గ్రా. బరువు ఉండి తక్కువ కాలంలో కోతకు వచ్చే రకం. కొంత వరకు ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. దిగుబడి 140-152 క్వింటాళ్ళు  ఎకరాకు వస్తుంది

READ ALSO : Rahul Gandhi : కాంగ్రెస్‌కు నష్టమని తెలిసినా.. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు- రాహుల్ గాంధీ

తెల్ల ఉల్లిగడ్డ రకాలు :

పూసా వైట్‌ స్పాట్‌: అధిక చక్కెర శాతం కలిగి ఉంటుంది. వరుగుల తయారీకి ఉపయోగిస్తారు.

అగ్రఫౌండ్ వైట్ ; నాసిక్‌ నుండి విడుదలైన రకం పూసా వైట్‌ స్లాట్‌ కంటే ఎక్కువ శాతం వరుగులనిస్తుంది.

READ ALSO : Assembly Elections 2023: ఇండియా కూటమిలో భారీ చిచ్చు.. ద్రోహం చేస్తారంటే కాంగ్రెస్‭ను నమ్మేవాడిని కాదన్న అఖిలేష్

హైబ్రీడ్ రకాలు ;

అర్కలాలిమ: ఆకుమచ్చ తెగులును తట్టుకునే పెద్ద ఎర్ర ఉల్లి గడ్డ రకం. నిల్వ నాణ్యత బాగుండి, 5 నెలల వరకు నిల్వ ఉంటాయి. గల్ఫ్‌ దేశాల ఎగుమతికి అనువైనది. ఈ ఎర్ర ఉల్లి గడ్డ రకం ఖరీఫ్‌, రబీలకు అనువైనది.