Ragging : గాంధీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కు పాల్పడిన మరో విద్యార్థి సస్పెండ్

గత కొద్ది రోజుల క్రితమే గాంధీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కు పాల్పడిన 10 మందిని యాంటీ ర్యాగింగ్ కమిటీ సస్పెండ్ చేసింది.

Ragging : గాంధీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కు పాల్పడిన మరో విద్యార్థి సస్పెండ్

Gandhi Medical College Ragging

Gandhi Medical College Ragging : తెలంగాణలో మళ్లీ ర్యాంగింగ్ భూతం పడగవిప్పింది. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ లో మళ్ళీ ర్యాగింగ్ కలకలం రేపింది. ర్యాగింగ్ కు పాల్పడిన మరో విద్యార్థిని సస్పెండ్ చేశారు. గత కొద్ది రోజుల క్రితమే గాంధీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కు పాల్పడిన 10 మందిని యాంటీ ర్యాగింగ్ కమిటీ సస్పెండ్ చేసింది. తాజాగా ర్యాగింగ్ కు పాల్పడిన మరో విద్యార్థిని ఏడాదిపాటు సస్పెండ్ చేసింది.

మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, గాంధీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ రెడ్డి నేతృత్వంలో ర్యాగింగ్ కమిటీ గురువారం కమిటీ ప్రత్యేక సమావేశమై పలు అంశాలపై తీర్మానాలు చేశారు. అనాటమీ విభాగంలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ లో ర్యాగింగ్ కు సంబంధించిన పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టగా 2020 బ్యాచ్ కు చెందిన ఓ విద్యార్థి పలుమార్లు జూనియర్లను ర్యాగింగ్ చేసినట్లు నిర్ధారణ అయింది.

Medico Preeti Case : మెడికో ప్రీతి ర్యాగింగ్ కు గురైనట్లు నిర్ధారణ.. సైఫ్ మెంటల్ గా వేధించినట్లు తేల్చిన కమిటీ

ఈ నేపథ్యంలో సదరు విద్యార్థిని ఏడాది పాటు హాస్టల్ తోపాటు కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తూ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కాగా, గతంలో ర్యాగింగ్ కు పాల్పడిన సస్పెన్షన్ కు గురైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యాంటి ర్యాగింగ్ కమిటీని కలిసి మరోసారి పాల్పడబోమని, సస్పెన్షన్ ఎత్తి వేయాలని కోరగా, వారి అభ్యర్థనను కమిటీ ఏకగీవ్రంగా తిరస్కరించింది.