అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

  • Publish Date - November 2, 2019 / 02:09 AM IST

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్ సీ, ఎంఎల్ఐఎస్ సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ వార్షిక పరీక్ష ఫీజు గడువును పొడిగించారు. (నవంబర్ 5, 2019) వరకు పరీక్ష ఫీజు గడువును పొడిగించినట్లు శుక్రవారం (నవంబర్ 1, 2019) అధికారులు ప్రకటించారు. ప్రీ-పీహెడ్ డీ, ఎంఫిల్-1, పరీక్షలను (నవంబర్ 23, 2019) నుంచి నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు www.braou.ac.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.