రేపే AP EDCET-2019 ఫలితాలు

  • Publish Date - May 16, 2019 / 07:44 AM IST

ఏపీలోని B.ED కళాశాలల్లో ప్రవేశాల కోసం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మే 6న ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ (EDCET‌-2019) ఫలితాలను నిర్వహించారు. ఈ ఫలితాలను శుక్రవారం(మే 17)న మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఫలితాలతోపాటు EDCET తుది ఆన్సర్ ‘కీ’ కూడా అధికారులు విడుదల చేయనున్నారు.

అసలు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 15న ఫలితాలను ప్రకటించాలి కానీ కొన్ని కారణాల వల్ల మే 17న ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్షకు మొత్తం 14,019 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 11,650 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 16 పట్టణాల పరిధిలోని 56 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు.