ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలను శుక్రవారం (నవంబర్ 1, 2019)న విడుదల చేసింది. అలాగే ప్రిలిమ్స్ పేపర్-1, పేపర్-2 ఫైనల్ కీ సెట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. తాజా ఫలితాల్లో మొత్తం 8351 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.
ఇక గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి 23వ తేదీ వరకు మొత్తం ఏడు సెషన్లలో ఆఫ్‌లైన్ పద్దతిలో జరగనున్నాయి. ఫలితాలతో పాటు పరీక్షలో రిజక్ట్ అయిన అభ్యర్థుల వివరాలను కూడా APPSC వెల్లడించింది.
డిసెంబరులో మెయిన్ ఎగ్జామ్స్:
షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 12 నుంచి 23 వరకు ‘గ్రూప్-1’ మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మొత్తం ఏడు పేపర్లుగా గ్రూప్-1 మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.