AP DEE-CET దరఖాస్తు గడువు పొడగింపు

  • Publish Date - April 29, 2019 / 11:09 AM IST

శుభవార్త.. ఆంధ్రప్రదేశ్‌లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ‘AP DEECET-2019 (డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్) ఫీజు చెల్లింపు గడువును 2019, మే 5 వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ పి.పార్వతి తెలిపారు. ఈ పరీక్షకు 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా సమానమైన విద్యా అర్హత ఉండి, 17 సంవత్సరాలు దాటినవారు ‘DEECET’కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంతేకాదు భ్యర్థులకు 17 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.  

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించి ఇచ్చిన గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు మే 5లోగా ఫీజు చెల్లించి మే 6లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సిందిగా కోరారు. ఇప్పటికే రెండుసార్లు దరఖాస్తు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే.  మే 15, 16 తేదీల్లో DEECET-2019 పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష విధానం:
మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు (PART-A, PART-B) విభాగాలుంటాయి. ‘PART-A’ నుంచి 60 ప్రశ్నలు – 60 మార్కులు , ‘PART-B’ నుంచి 40 ప్రశ్నలు – 40 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది.