ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల ఆలస్యం?

  • Publish Date - May 1, 2019 / 06:34 AM IST

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఏపీపైనా పడింది. ఎంసెట్ ఫలితాల విడుదలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ఇంటర్ బోర్డు. దీనికి కారణం.. తెలంగాణలో రీ వెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ ఉండటమే. 20వేల మంది తెలంగాణ స్టూడెంట్స్.. ఏపీ ఎంసెట్ రాశారు. వారికి ఇంకా మెమోలు రాలేదు. దీనికితోడు కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లపైనా విధివిధానాలు ఖరారు కాలేదు.

ఈ రెండు విషయాలపై క్లారిటీ వచ్చిన తర్వాతే ఎంసెట్ ర్యాంకులు ప్రకటించాలని భావిస్తోంది ఏపీ. ఈ అంశంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. 2, 3 రోజులు ఆలస్యం అయినా పక్కాగా జరిగిపోవాలని.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ లో ఏర్పడిన గందరగోళం, 20వేల మంది స్టూడెంట్స్ కు సంబంధించిన అంశం కావటంతో ఆలస్యం కావొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.